Begin typing your search above and press return to search.

కొత్త వైఫై...సెక‌న్‌ లో 40 జీబీ డౌన్‌ లోడ్‌

By:  Tupaki Desk   |   21 March 2017 5:30 PM GMT
కొత్త వైఫై...సెక‌న్‌ లో 40 జీబీ డౌన్‌ లోడ్‌
X
టెక్నాల‌జీ కొత్త పుంత‌లు తొక్కుతున్న నేప‌థ్యంలో అందుబాటులో వ‌చ్చే సౌక‌ర్యాలు సైతం అదే రీతిలో ఉంటున్నాయి. తాజాగా వ‌చ్చిన సాంకేతిక సౌల‌భ్యాన్ని చూస్తే వావ్ అన‌కుండా ఉండ‌లేం. అంతేకదా మ‌రి సెక‌నులో 40 గిగాబైట్లు. అంటే ప్ర‌స్తుతం కంటే వంద‌రెట్ల వేగంగా డౌన్ లోడ్. నెదర్లాండ్స్‌లోని ఈండ్‌ హోవెన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ వైఫై నెట్‌ వర్క్‌ ను అభివృద్ధి చేశారు. హానిలేని పరారుణ (ఇన్‌ ఫ్రారెడ్) కిరణాల ఆధారంగా వందరెట్ల వేగంతో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించే కొత్త వైఫై పరికరాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. మరిన్ని కంప్యూటర్లకు ఈ వైఫైని ఉపయోగించి ఆటంకం లేకుండా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందవచ్చని వారు తెలిపారు. దీని సామర్థ్యం సెకన్‌ కు 40 గిగాబిట్ల కన్నా ఎక్కువేనని శాస్త్రవేత్తలు చెప్పారు.

కొత్త వైఫైతో అనుసంధానించే ప్రతి కంప్యూటర్‌ కు ప్రత్యేక కాంతికిరణం అందుతుందని, ఈ సాధనాన్ని ఇతర కంప్యూటర్లకు షేర్ చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఈ వైఫై చాలా చౌక. ఏర్పాటుచేయడం సులభం. వైఫైపై ఉండే సెంట్రల్ లైట్ యాంటెన్నాల నుంచి వైర్‌ లెస్ సమాచారం వస్తుంది. కాంతికిరణాలను ఆప్టికల్ ఫైబర్ ఖచ్చితంగా దిశానిర్దేశం చేస్తుంది అని పరిశోధకులు వివరించారు. కాంతి తరంగదూరాన్ని మారిస్తే, కాంతికిరణం దిశ కూడా మారుతుంది. కంటిలోని రెటీనాకు చేరుకోలేని సురక్షిత పరారుణ తరంగదూరాన్ని ఈ వైఫైలో ఉపయోగించడంతో కళ్ల‌కు ఎటువంటి హాని ఉండదన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/