Begin typing your search above and press return to search.

బీజేపీ ప్రచార వ్యూహం సిద్ధం.. రంగంలోకి వీరే..

By:  Tupaki Desk   |   18 Nov 2018 7:14 AM GMT
బీజేపీ ప్రచార వ్యూహం సిద్ధం.. రంగంలోకి వీరే..
X
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పరువు నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కనీస సీట్లను గెలిపించుకునేందుకు రాష్ట్రనేతలతో పాటు, జాతీయ స్థాయి నేతలను మోహరిస్తూ ప్రణాళిక రూపొందించారు. అన్ని పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశారు కాబట్టి ఇక మిగిలింది ప్రచారమే. ప్రజలను ఆకట్టుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించి ఓట్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది.

ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను బీజేపీలోని కొంతమంది ప్రధాన నేతలకు అధిష్టానం అప్పగించింది. వీరిలో 40 మంది రాష్ట్ర, కేంద్ర ముఖ్యులు ఉన్నారు. ఎవరు ఏ రోజు ప్రచారం నిర్వహించాలో షెడ్యూల్ కూడా నిర్ణయించారు. జిల్లా కేంద్రాలతో పాటు పలు నియోజకవర్గాల్లో సభలు - సమావేశాల్లో పాల్గొననున్నారు.

స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించిన వారిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ - జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఉన్నారు. వీరు త్వరలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలాగే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ - కేంద్రమంత్రుల ప్రచార తేదీలు నిర్ణయించాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల నాయకుల్లో లక్ష్మణ్ - బండారు దత్తాత్రేయ - కిషన్ రెడ్డి- సినీనటి జీవితతో పాటు ఏపీ నేతలు కన్నా లక్ష్మినారాయణ - హరిబాబు - పురందేశ్వరి కూడా ఉన్నారు.

*ఆ 40 మంది స్టార్ క్యాంపెయినర్లు వీరే...

ప్రధాని నరేంద్ర మోడీ - జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా - కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ - రాజ్‌ నాథ్‌ సింగ్‌ - సుష్మా స్వరాజ్‌ - నితిన్‌ గడ్కరీ - రామ్‌ లాల్‌ - నిర్మలా సీతారామన్‌ - స్మృతి ఇరానీ - యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ - జాతీయ నేతలు రమణ్‌ సింగ్‌ - రవిశంకర్‌ ప్రసాద్‌ - ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ - జువల్‌ ఓరం - పీకే కృష్ణదాస్‌ - జగత్‌ ప్రకాశ్‌ నడ్డా - పియూష్‌ గోయల్‌ - థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ - పురుషోత్తమ్‌ రూపాలా - సాధ్వి నిరంజన్‌ జ్యోతి - హన్స్‌ రాజ్‌ గంగారామ్‌ - డీవీ సదానంద గౌడ - మురళీధర్‌ రావ్‌ - రాంమాధవ్‌ - బీఎల్‌ సంతోష్‌ - హేమా మాలిని - కె. లక్ష్మణ్ - ఇంద్రసేనా రెడ్డి - స్వామి పరిపూర్ణానంద - చింతా సాంబమూర్తి - జీవిత - కన్నా లక్ష్మీనారాయణ - కిషన్‌ రెడ్డి - బండారు దత్తాత్రేయ - కె. హరిబాబు, - జీవీఎల్‌ నరసింహారావు - సాయికుమార్‌ - దగ్గుబాటి పురందేశ్వరి - ప్రేమేందర్‌ రెడ్డి - మంత్రి శ్రీనివాసులు.