Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ కు బిగ్‌ షాక్‌!.. ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్‌!

By:  Tupaki Desk   |   20 April 2019 1:27 PM GMT
టీ కాంగ్రెస్ కు బిగ్‌ షాక్‌!.. ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్‌!
X
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తెలంగాణ‌లో నిజంగానే చ‌చ్చింద‌న్న మాట వినిపిస్తోంది. ప్ర‌జ‌ల విశ్వాసం చూరగొనటంలో విఫ‌లం అవుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో చ‌చ్చిన‌ట్టేన‌ని ఇటీవ‌లే ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయిన సీనియ‌ర్ నేత డీకే అరుణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. శ‌నివారం ఉద‌యం డీకే నోట నుంచి ఈ వ్యాఖ్య‌లు వినిపిస్తే... సాయంత్రానికే ఆ మాట నిజ‌మ‌య్యేలా కీల‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ల‌పై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఓ ముగ్గురు టీఆర్ ఎస్ లో చేరేందుకు సిద్ధ‌మైపోయార‌న్న ఆ వార్త ఇప్పుడు తెలంగాణ‌లో పెను క‌ల‌క‌ల‌మే రేపుతోంది.

ఇలా హ‌స్తం పార్టీకి షాకిచ్చి కారెక్కుతున్న వారిలో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి)తో పాటు కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ గా ముద్ర‌ప‌డిన ఆ పార్టీ సీనియ‌ర్ నేత గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి (భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే) - పొదెం వీర‌య్య (భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే)లున్నారు. నాలుగు నెల‌ల క్రితం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఓట‌ర్లు దాదాపుగా చీకొట్టినంత ప‌నిచేశారు. ఎన్నిక‌ల్లో 99 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయ‌గా... ఆ పార్టీ కేవ‌లం 19 స్థానాల‌ను నెగ్గింది. ఆ నెగ్గిన ఎమ్మెల్యేల్లోనూ ఇప్ప‌టికే చాలా మంది టీఆర్ ఎస్ గూటికి చేరిపోయారు. ఈ క్ర‌మంలో మ‌రోమారు ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేలు హ‌స్తం పార్టీకి చేయిచ్చేస్తుండ‌టంతో ఆ పార్టీ ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారే ప్ర‌మాదం లేక‌పోలేదు.

ఈ ముగ్గురు పార్టీ మారితే... ఇక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బ‌లం ఆరుకు ప‌రిమితం కానుంది. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను కూడా కోల్పోయిన‌ట్టే లెక్క‌. ఎందుకంటే... కాంగ్రెస్ పార్టీ బ‌లం ఆరుకు కుదించుకునిపోతే... ఆ పార్టీ కంటే ఏడుగురు ఎమ్మెల్యేల‌తో మ‌జ్లిస్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాలోకి వ‌స్తుంది. ఈ ప‌రిణామాలు ఎలా ఉన్నా... గండ్ర‌ - జ‌గ్గారెడ్డి - వీర‌య్య‌లు టీఆర్ ఎస్ లో చేరిపోతున్న‌ట్లుగా వస్తున్న వార్త‌లు మాత్రం తెలుగు నేల రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌ గా మారిపోయాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. టీఆర్ ఎస్ లోకి చేరేందుకు స‌న్న‌ద్ధ‌మైన వీరంతా ఈ నెల 24న ముహూర్తం ఫిక్స్ చేసుకున్నార‌ట‌.