Begin typing your search above and press return to search.

ఏపీకి మూడు .. తెలంగాణకు ఒకటి

By:  Tupaki Desk   |   26 Sep 2016 5:08 PM GMT
ఏపీకి మూడు .. తెలంగాణకు ఒకటి
X
కొత్త ఎయిర్ పోర్ట్ ల మీద రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరచూ చాలానే మాటలు చెబుతున్న సంగతి తెలిసిందే. చంద్రుళ్ల మాటలు ఎలా ఉన్నా తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ స్క్రీనింగ్ కమిటీ నాలుగు కొత్త ఎయిర్ పోర్ట్ లను రెండు తెలుగు రాష్ట్రాలకు ఓకే చెబుతూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఓకే అన్న నాలుగు ఎయిర్ పోర్ట్ లలో మూడు ఏపీకి కాగా.. ఒకటి తెలంగాణకు కావటం గమనార్హం. కొత్తగా వచ్చే ఎయిర్ పోర్ట్ లకు సంబంధించి చూస్తే.. ఏపీ లో మూడు ప్రాంతాల(ఉత్తరాంధ్ర.. కోస్తా.. రాయలసీమ) కు ఒక్కొక్కటి చొప్పున కేటాయిస్తే.. తెలంగాణలో మాత్రం కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కు సూత్రప్రాయంగా ఓకే అంది.

ఏపీ విషయానికి వస్తే విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఒకటి.. మరొకటి నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద.. ఇంకొకటి కర్నూలుకు సమీపంలోని ఓర్వకల్లు వద్ద ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయటానికి సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలపటంతో పాటు.. కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కు సైట్ క్లియరెన్స్ కు ఓకే చెప్పేసింది. ఇక.. ఏపీలో నిర్మించే మూడు విమానాశ్రయాలలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. పీపీపీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వమే ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనుంది. ఏటా 63 లక్షలమంది ప్రయాణికుల అవసరాలు తీర్చటం లక్ష్యంగా తొలివిడతలో రూ.2200 కోట్ల అంచనాతో ఈ ఎయిర్ పోర్ట్ ను ఏర్పాటు చేయనున్నారు.

ఇక.. కొత్తగా ఓకే చేసిన ఎయిర్ పోర్ట్ కు అవసరమైన భూముల లెక్క చూస్తే.. దగదర్తి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి 1390 ఎకరాలు అవసరమని అంచనా వేయగా.. ఇందులో 840 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా.. 290ఎకరాలు ప్రైవేటు భూమిని సేకరించాల్సి వచ్చింది. ఇక.. ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు 1010 ఎకరాలు అవసరమని అంచనా వేశారు