Begin typing your search above and press return to search.

న‌దిలో రైలు బోగీలు.. లేటెస్ట్ అప్ డేట్స్‌

By:  Tupaki Desk   |   5 Aug 2015 8:22 AM GMT
న‌దిలో రైలు బోగీలు.. లేటెస్ట్ అప్ డేట్స్‌
X
భారీ వ‌ర్షాల కార‌ణంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కుదావా రైల్వేస్టేష‌న్ స‌మీపంలోని మాచ‌క్ న‌ది క‌ల్వ‌ర్టు దాటుతుండ‌గా మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి రెండు రైళ్ల‌కు చెందిన బోగీలు న‌దిలో ప‌డిపోవ‌టం తెలిసిందే. ఈ ఘోర ప్ర‌మాదానికి సంబంధించి తాజా అప్ డేట్స్ చూస్తే..

1. ఈ ఘోర దుర్ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 31 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించిన‌ట్లుగా గుర్తించారు. మ‌రో 25 మందికి గాయాల‌య్యాయి.

2. రైళ్ల ప్ర‌మాదానికి కార‌ణం ప‌ట్టాల మీద నిలిచిన నీరుగా చెబుతున్నారు. మొద‌ట అనుకున్న‌ట్లుగా మాచ‌క్ న‌ది మీద దుర్ఘ‌ట‌న జ‌ర‌గ‌లేద‌ని.. దాని ముందున్న క‌ల్వ‌ర్ట్ ద‌గ్గ‌ర జ‌రిగింద‌ని గుర్తించారు.

3. స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం రైల్వే అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా న‌దిలో నీటి ప్ర‌వాహ ఉధృతి ఎక్కువ‌గా ఉండ‌టంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయి.

4. ఈ దుర్ఘ‌ట‌న‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ స్పందించారు. ప్ర‌మాదంపై తీవ్ర విచారం వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. చ‌నిపోయిన కుటుంబాల‌కు ప్ర‌గాఢ సంతాపం తెలిపారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాక్షించారు.

5. రైలు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి రూ.2ల‌క్ష‌లు చొప్పున.. తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి రూ.50వేలు.. స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన వారికి రూ.25వేల చొప్పున ప‌రిహారం అందించ‌నున్న‌ట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

6. ప్ర‌మాదానికి గురైన కామాయాని ఎక్స్ ప్రెస్‌ కు చెందిన ఆరు బోగీలు.. మ‌రో ట్రాక్ మీద వ‌స్తున్న జ‌న‌తా ఎక్స్ ప్రెస్ లోని నాలుగు బోగీలు ప‌ట్టాలు త‌ప్పిన‌ట్లుగా అధికారులు చెబుతున్నారు. క‌ల్వ‌ర్ట్ రెండు వైపులా నీరు చేరుకోవ‌టంతో బోగీల్లోకి నీళ్లు చేరాయ‌ని.. స‌మాచారం అందుకున్న అధికారులు వెంట‌నే స్పందించి.. బోగీల్లోని ప్ర‌యాణికులకు సహాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు పేర్కొన్నారు.