Begin typing your search above and press return to search.

కొత్త నినాదం షురూ చేసిన కాంగ్రెస్

By:  Tupaki Desk   |   24 July 2016 6:17 AM GMT
కొత్త నినాదం షురూ చేసిన కాంగ్రెస్
X
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అధికార జెండా పాతలన్న లక్ష్యంతో వెళుతున్న కాంగ్రెస్.. మిగిలిన పార్టీల కంటే ముందుగా రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసింది. మిగిలిన పార్టీలతో పోలిస్తే.. యూపీలో కాంగ్రెస్ పరపతి.. పరిధి పరిమితం మాత్రమే. అయితే.. వ్యూహాత్మకంగా వ్యవహరించటం ద్వారా పవర్ పగ్గాలు చేతికి వస్తాయన్న ఆశతో ఉంది.ఇందుకు తగ్గట్లుగా ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసింది.

యూపీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓబీసీ నేతను (రాజ్ బబ్బర్) .. పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా ముస్లిం (గులాం నబీ అజాద్)ను.. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బ్రాహ్మిణ్ (షీలా దీక్షిత్)ను ఎంపిక చేసిన కాంగ్రెస్.. తాజాగా ‘’27 ఏళ్లుగా యూపీ పతనం’’ (27 సాల్ యూపీ బేహాల్) నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి మూడు రోజుల బస్సుయాత్రను షురూ చేసింది.

యూపీలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్నికోల్పోయి 27 ఏళ్లు పూర్తి కావటంతో.. ఈ నినాదాన్నిఎంపిక చేసుకుంది. ఈ యాత్రలో యూపీ ఎన్నికల త్రిమూర్తులుగా భావిస్తున్న రాజ్ బబ్బర్.. గులాంనబీ అజాద్.. షీలా దీక్షిత్ లు పాల్గొంటున్నారు. ఈ యాత్రనుపార్టీ అధినేత్రి సోనియా.. యువరాజు రాహుల్ ప్రారంభించారు. కోటి ఆశలతో యూపీ ఎన్నికల మీద దృష్టి పెట్టిన కాంగ్రెస్ కు.. అక్కడి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.