కోట్ల హవాలా డబ్బు..గుజరాత్ టు హైదరాబాద్..

Mon Oct 22 2018 17:11:25 GMT+0530 (IST)

హైదరాబాద్ లో భారీ స్థాయిలో హవాలా డబ్బు పట్టుబడడం కలకలం రేపుతోంది. గుజరాత్ కు చెందిన అతుల్ అనే వ్యక్తి నుంచి 2.50 కోట్ల డబ్బును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్ లోని బొగ్గుల కుంట మేడాస్ అపార్ట్ మెంట్ దగ్గర ఈ భారీ సొమ్మును పట్టుకున్నారు. హవాలా సొమ్మును తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు.గుజరాత్ నుంచి హవాలా మార్గంలో డబ్బును తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు వ్యాపారి అతుల్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. దీంతో భారీగా హవాలా మనీ బయటపడింది. ఆరు శాతం వడ్డీకి డబ్బులు హవాలా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈసీ అదేశాలతో రాష్ట్ర యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతోంది. నగదు మద్యం రవాణాపై నిఘా పెట్టారు. దీంతో రాష్ట్ర సరిహద్దులు - చెక్ పోస్టుల వద్ద మద్యం - నగదు కోట్లలో పట్టుబడుతోంది. మూడు రోజుల క్రితం కూడా భారీగా హవాలా డబ్బు పట్టుబడుతుండడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. తాజా హవాలా  డబ్బును ఎక్కడినుంచి ఎక్కడికి తరలిస్తున్నానేది పోలీసులు ఆరాతీస్తున్నారు.

మూడు రోజుల క్రితం 59 లక్షల డబ్బు దొరికింది. కాగా ఈ హవాలా సొమ్ము జగిత్యాలకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వలపన్ని పట్టుకొన్నారు. డబ్బు తరలిస్తున్న కారు తెలుగుయువత తెలంగాణ ఉపాధ్యక్షుడిది గా గుర్తించారు. ఈ అక్రమ డబ్బు తరలింపు వెనుక రాజకీయ పార్టీల నేతల హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.