Begin typing your search above and press return to search.

ఒప్పందం ర‌ద్దు.. మెక్‌ డొనాల్డ్స్ స్టోర్లు క్లోజ్‌

By:  Tupaki Desk   |   6 Sep 2017 8:14 AM GMT
ఒప్పందం ర‌ద్దు.. మెక్‌ డొనాల్డ్స్ స్టోర్లు క్లోజ్‌
X
మెక్ డొనాల్డ్స్‌.. రుచిక‌ర‌మైన ఆహార ప‌దార్థాల‌కు బ్రాండ్‌! కానీ ఇక నుంచి ఈ పేరు క‌నిపించ‌దు. రేప‌టి నుంచి అంటే గురువారం నుంచి మెక్‌ డొనాల్డ్స్ పేరుతో నోరూరించే పిజ్జాలు - బ‌ర్గ‌ర్లు.. వంటి ఆహార ప‌దార్థాలు క‌నిపిస్తే అవి న‌కిలీవ‌ని గుర్తుంచుకోండి. ఎందుకంటే బుధ‌వారం నుంచి మెక్‌ డొనాల్డ్స్ స్టోర్లు మూడ‌ప‌డ్డాయి. ఈ బ్రాండ్ పేరుతో ఉత్త‌ర‌ - ద‌క్షిణ భార‌త‌దేశంలో ఉన్న సుమారు 169 స్టోర్లు క్లోజ్ అయిపోయాయి. ఈ కంపెనీ నిర్ణ‌య‌మేమో గాని.. ఇందులో ప‌నిచేస్తున్న ఉద్యోగులు మాత్రం నిరుద్యోగులుగా మార‌బోతున్నారు.

పాపుల‌ర్ అయిన - ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపు పొందిన‌ ప్రొడ‌క్టును వేరొక కంపెనీ టేకోవ‌ర్ చేయ‌డం - పాత కంపెనీ పేరు మీదే వ‌స్తువులు తయారుచేయ‌డం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మెక్ డొనాల్డ్స్‌ తో కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు లిమిటెడ్ (సీఆర్‌ పీఎల్‌) చేసుకున్న ఒప్పందం.. సెప్టెంబ‌రు 5తో ముగిసింది. ఈ నేప‌థ్యంలో మెక్‌ డొనాల్డ్స్‌ షాపులు బుధవారం నుంచి మూతపడనున్నాయి. దీంతో వేలాదిమంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. మెక్‌ డోనాల్డ్స్‌ ప్రకారం మొత్తం 169 దుకాణాల్లో మెక్ డొనాల్డ్స్ ట్రేడ్‌ మార్క్‌ ఆహార ఉత్పత్తుల అమ్మకాలు నిలిచి పోనున్నాయి.

సెప్టెంబరు 6 నుంచి తన బ్రాండ్ పేరు - ట్రేడ్‌ మార్క్‌ను ఉపయోగించే అధికారం సీఆర్‌ పీఎల్‌ కు లేదని మెక్ డొనాల్డ్స్‌ పేర్కొంది. రద్దు నోటీసు కాలం సెప్టెంబరు 5 న ముగిసినందున, మెక్ డొనాల్డ్ మేధో సంపత్తిని ఉపయోగించేందుకు సీఆర్‌పీఎల్‌కు అధికారం లేద‌ని స్ప‌ష్టంచేసింది. అంటే వారు మెక్ డొనాల్డ్ పేర్లు - ట్రేడ్‌ మార్క్‌ పేర్లు - డిజైన్లు - బ్రాండింగ్ - మార్కెటింగ్ లాంటివి ఉపయోగించడం మానివేయాలి. ఇక‌ చట్టపరమైన , ఒప్పంద హక్కుల ప్రకారం తాము వ్యవహరించనున్నామని మెక్ డోనాల్డ్ ఇండియా ప్రతినిధి చెప్పారు.