Begin typing your search above and press return to search.

త‌లాఖ్ పంచాయ‌తీ ప్ర‌ధాన‌మంత్రి వ‌ద్ద‌కు చేరింది

By:  Tupaki Desk   |   23 Oct 2016 11:14 AM GMT
త‌లాఖ్ పంచాయ‌తీ ప్ర‌ధాన‌మంత్రి వ‌ద్ద‌కు చేరింది
X
ట్రిపుల్ తలాక్‌ పై ముస్లిం మహిళల్లో నెల‌కొన్న అసంతృప్తి మ‌రోమారు బ‌య‌ట‌ప‌డింది. ట్రిపుల్ తలాక్‌ ను రద్దు చేయాలని కోరుతూ అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాల్సిందిగా ముంబైకి చెందిన ఓ మహిళ ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీకి విజ్ఞప్తి చేసింది. ఘటన వివరాలిలా ఉన్నాయి. పుణెకు చెందిన ఆష్రియా అనే యువతికి 16 ఏళ్ల వయసులో కూరగాయల వ్యాపారం చేసే మహ్మద్ ఖాజీం భగవాన్ అనే ఓ ధనికుడితో పళ్లైంది. వీరి వివాహ జీవితంలో ఎనిమిది నెలల బాబు ఉన్నాడు. రెండేళ్ల తర్వాత ఆ పెళ్లి పెటాకులైంది. ఓ కాగితంపై తలాక్ అని మూడుసార్లు రాసి ఇచ్చి వివాహం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు.

త‌న‌కు అన్యాయం చేసిన‌ భర్త తీరుపై బాధిత మహిళ ఆష్రియా స్పందిస్తూ.. ట్రిపుల్ తలాక్ నోటీసును అందుకున్నాన‌ని అయితే తాను దాన్ని అంగీకరించనని స్ప‌ష్టం చేశారు. ట్రిపుల్ తలాక్‌ ను ఫ్యామిలీ కోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలిపింది. సాంప్రదాయాల పేరుతో ముస్లీం మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారన్న ఆమె తనలాంటి బాధిత మహిళలకు సహాయం చేయాల్సిందిగా ప్రధానిని వేడుకుంటున్నట్లు పేర్కొంది. వివాహం తర్వాత చదువుకుంటానన్న షరతుపై త‌న‌ను వివాహం చేసుకొని అనంత‌రం చ‌దువు మానిపించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. భ‌ర్త‌తో దూరంగా ఉంటున్నందున ఇప్పుడు చదువును కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఆష్రియా తండ్రి నిస్సార్ భగవాన్ మాట్లాడుతూ.. "నేనో కూరగాయలు అమ్మే మామూలు వ్యక్తిని. నా కుతూరికి ఆమె చదువు పూర్తికాకముందే తొందరపడి పెళ్లిచేసి తప్పుచేశాను. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. ఏ ఒక్కరూ కూడా నా కూతురు వలె బాధ పడకూడదు" అని అన్నారు. ముస్లిం మహిళల హక్కులకై దశాబ్దాలుగా పోరాడుతున్న ముస్లీం సత్యశోధక్ మండల్ చీఫ్ శంషుద్దీన్ తంబోలీ స్పందిస్తూ.. దేశంలో యూనిఫాం కోడ్ తీసుకురావడంపై అసత్య ప్రచారం జరుగుతుంద‌ని అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి పేరుతో ప్రభుత్వం హిందుత్వం, కాషాయికరణ చేయడానికి ప్రయత్నిస్తుందని ముస్లి సమాజం భయపడుతుందని కానీ ఇది మ‌హిళ‌ల హ‌క్కుల కోణంలో చూడాల‌ని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/