Begin typing your search above and press return to search.

కోటీశ్వ‌రుల అసెంబ్లీ..ఈ రాష్ట్రందే ప్ర‌త్యేక‌త‌!

By:  Tupaki Desk   |   16 Dec 2018 4:33 PM GMT
కోటీశ్వ‌రుల అసెంబ్లీ..ఈ రాష్ట్రందే ప్ర‌త్యేక‌త‌!
X
ఐదు రాష్ర్టాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల పర్వంలోని ప‌లు ప‌ద‌నిస‌లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తున్నాయి. రాజస్థాన్‌ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఎక్కువ మంది అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నారు. కొత్తగా ఎన్నికైన 199 మంది ఎమ్మెల్యేల్లో 158 మంది కోటీశ్వరులేనని ‘అసోయేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్’ నిర్వహించిన సర్వేలే స్పష్టమైంది. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా 82 మంది కోటీశ్వరులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ పార్టీకి మొత్తం 99 మంది ఎమ్మెల్యేలుండగా 17 మంది మినహా అందరూ కోటీశ్వరులే.

200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో ఎన్నికల సమయంలో ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో కాంగ్రెస్‌ కు 99 సీట్లు - బీజేపీ-73 - బీఎస్పీ-6 - ఆర్ ఎల్‌ డీ-1 - స్వతంత్రులు-20 స్థానాల్లో గెలిచారు. గెలిచిన వారిలో వివ‌రాల ప్ర‌కారం కాంగ్రెస్ తర్వాత బీజేపీ నుంచి ఎక్కువగా కోటీశ్వరులు ఎన్నికయ్యారు. ఆ పార్టీకి మొత్తం 73 మంది ఎమ్మెల్యేలుండగా… అందులో రూ.1 కోటికి మించి ఆస్తి ఉన్న ఎమ్మెల్యేలు 58 మంది ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు ప్రధాన పార్టీల నుంచి అత్యధికంగా కోటీశ్వరులే అవకాశం దక్కించుకోవడంతో.. ఇప్పుడు రాజస్థాన్ అసెంబ్లీలో ఉన్న మూడొంతుల మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.