Begin typing your search above and press return to search.

పాక్‌ కి షాక్‌..15 మంది పాక్ రేంజ‌ర్ల హ‌తం

By:  Tupaki Desk   |   28 Oct 2016 11:40 AM GMT
పాక్‌ కి షాక్‌..15 మంది పాక్ రేంజ‌ర్ల హ‌తం
X
ఉరీ ఘ‌ట‌న త‌ర్వాత స‌ర్జిక‌ల్ దాడుల‌తో పాకిస్థాన్ దిమ్మ‌తిరిగే జ‌వాబిచ్చిన భార‌త్‌.. ఆ త‌ర్వాత అంత‌ర్జాతీయంగా కూడా ఆదేశంపై పోరు సాగించింది. సార్క్ దేశాల స‌ద‌స్సు ను బ‌హిష్కరించేలా చేసి, పాక్‌ కు త‌గిన బుద్ధి చెప్పింది. అయితే, పాక్ బుద్ధి ఇంకా మార‌లేదు. భార‌త్ స‌రిహ‌ద్దుల వెంబ‌డి ప‌దే ప‌దే కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో రెండు రోజుల కింద‌ట ఓ భార‌త జ‌వాను ప్రాణాలు కొల్పోయాడు. దీంతో ఈ ద‌ఫా మ‌రింత గ‌ట్టిగా బుద్ధి చెప్పాల‌ని భావించిన భార‌త్ .. పాక్ సైనికుల‌పై విరుచుకుప‌డింది.

కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి ఉద్వాస‌న ప‌లికిన పాక్ సైనికుల‌పై ఎదురు కాల్పుల‌కు దిగింది. ఈక్ర‌మంలో శుక్ర‌వారం జ‌రిగిన కాల్పుల్లో దాదాపు 15 మంది పాక్ రేంజ‌ర్లు హ‌త‌మైన‌ట్టు తెలిసింది. అయితే, దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ వద్ద పాక్ బ‌ల‌గాలు కాల్పులు జ‌రిపాయి. దీనికి ప్ర‌తిగా భార‌త జ‌వాన్లు కూడా పాక్ సైనికుల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఏకంగా 15 మంది పాకిస్థానీ జవాన్లు హతమైనట్లు తెలిసింది.

ఈ ఘ‌ట‌న‌పై బీఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కాల్పుల్లో ఎంతమంది పాక్ జవాన్లు చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేమని, సుమారు 15 మంది చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. అదేస‌మ‌యంలో భారత జవాన్లలో ఏ ఒక్కరూ గాయపడలేదని తెలిపారు. మరోవైపు, పాక్ రేంజర్ల కాల్పులతో సరిహద్దు ప్రాంత పౌరుడు ఒకరు మరణించాడు. మరో బాలికతో పాటు ముగ్గురికి గాయాలయ్యాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/