Begin typing your search above and press return to search.

బీజేపీతో టచ్ లో పన్నెండు మంది ఎమ్మెల్యేలు?

By:  Tupaki Desk   |   11 Sep 2019 6:40 AM GMT
బీజేపీతో టచ్ లో పన్నెండు మంది ఎమ్మెల్యేలు?
X
తెలంగాణలో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ మంటలు గట్టిగానే లేచినట్టుగా ఉన్నాయి. పలువురు నేతలు తమ అసంతృప్తిని బాహాటంగానే చాటుకున్నారు. అసలు తను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి - తన సన్నిహితుడిని హోం మినిస్టర్ గా నియమించి కొన్ని నెలల పాటు కేబినెట్ ను ఏర్పాటు చేయకపోయినా కేసీఆర్ ను ఎవ్వరూ ప్రశ్నించలేదు. అలాంటిది ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కలేదని పలువురు సీనియర్లే అసహనం వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితికి అంతా కారణం ఏమిటంటే.. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉనికి చాటడమే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ - ఇటు భారతీయ జనతా పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా కొన్ని సీట్లను పొందాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తిన్న ఎదురుదెబ్బ నుంచి అవి చాలా కోలుకున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అయితే మరీ రంకెలు వేస్తూ ఉంది.

తెలంగాణలో టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ వాళ్లు అంటున్నారు. కొంతమంది నేతలను భారతీయ జనతా పార్టీ దువ్వుతోందనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తికి గురి అయిన నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి రెడీ అని ముందుగా సంకేతాలు ఇచ్చారట.

మొత్తం పన్నెండు మంది ఇప్పటికిప్పుడు బీజేపీలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ మేరకు అమిత్ షా ద్వారా వెళ్లడానికే రెడీ అయ్యారట. కానీ.. ఇప్పుడే వెళ్లడం మరీ అర్లీ అవుతుందని చివరకు ఆ నేతలు వెనక్కు తగ్గారని సమాచారం.

ఏరకంగా చూసినా తెలంగాణ ఎన్నికలో ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టం. అందుకే టీఆర్ ఎస్ లీడర్లు ప్రస్తుతానికి కామ్ అయ్యారని - కొన్నాళ్ల పాటు వేచి చూడటానికి వారు ఫిక్సయ్యారని తెలుస్తోంది. మొత్తం పన్నెండు మంది మాత్రం ఇప్పటికే తిరుగుబాటుకు రెడీ అయ్యి - వెనక్కు తగ్గినట్టుగా మాత్రం ప్రచారం జరుగుతూ ఉంది!