Begin typing your search above and press return to search.

మోడీకి వ్య‌తిరేకంగా కోర్టుకు వెళ్లిన 1000 మంది రైతులు

By:  Tupaki Desk   |   18 Sep 2018 5:01 PM GMT
మోడీకి వ్య‌తిరేకంగా కోర్టుకు వెళ్లిన 1000 మంది రైతులు
X
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి త‌న సొంత రాష్ట్రంలోని ఊహించిన షాక్ త‌గిలింది. త‌న‌ కలల ప్రాజెక్టు ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలును గుజరాత్ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే వివిధ జిల్లాలకు చెందిన వెయ్యిమంది రైతులు మంగళవారం గుజరాత్ హైకోర్టులో మూకుమ్మడి అఫిడవిట్ సమర్పించారు. ముంబై - అహ్మదాబాద్ మధ్య తిరిగే ఈ బుల్లెట్ రైలు.. మధ్యలో సముద్ర గర్భం నుంచి వెళ్లనున్న సంగ‌తి తెలిసిందే. ఏడు కిలోమీటర్ల మేర ఈ హైస్పీడ్ రైలు సముద్ర గర్భం నుంచి వెళ్లనుంది. థానె క్రీక్ సమీపంలో ఈ అండర్ సీ టన్నెల్ నిర్మించనున్నారు. అయితే ఇది నిర్మించడం అంత ఈజీ కాదు. మొత్తం 21 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించనుండగా.. అందులో ఏడు కిలోమీటర్లు సముద్ర గర్భం నుంచి వెళ్లనున్నట్లు నేషనల హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ అచల్ ఖరె వెల్లడించారు. థానె క్రీక్ దగ్గర ఒక్కో దాని మధ్య 250 మీటర్ల దూరంతో మొత్తం 66 బోర్‌ హోల్స్ చేశారు. దీనికోసం జపాన్ నుంచి ప్రత్యేకమైన టెక్నాలజీ - మిషనరీని తీసుకొచ్చారు.

ఇలా ఓ వైపు ప్ర‌తిష్టాత్మ‌కంగా స‌ర్కారు ముందుకు సాగుతుంటే గుజరాత్ రైతులు మాత్రం రోడ్డెక్కారు. 2015 సెప్టెంబర్‌ లో జపాన్ భారత్‌ తో బుల్లెట్ రైలు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత గుజరాత్ సర్కారు భూసేకరణ చట్టం నిబంధనలను నీరుగార్చిందని రైతులు త‌మ అఫిడ‌విట్‌ లో ఆరోపించారు. పునరావాసం, తరలింపునకు సంబంధించి సామాజిక ప్రభావ అంచనా కూడా ప్రభుత్వం వేయడం లేదని రైతులు తమ అఫిడవిట్‌ లో తెలిపారు. ప్రభుత్వ విభాగాలు రైతులకు తెలియకుండా ఏవేవో చర్యలు చేపడుతున్నారని వివరించారు. రైలు మార్గం కోసం తమ భూములను స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు అందులో తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత భూసేకరణ విధానాలు ప్రాజెక్టుకు అల్పవడ్డీ రుణం సమకూరుస్తున్న జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. గత ఐదువారాలుగా హైకోర్టు విచారణ ముందుకు సాగడం లేదని - ప్రాజెక్టుని ఆపాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని రైతుల తరఫు న్యాయవాది మీడియాకు చెప్పారు. కేంద్రం హైకోర్టుకు సమాధానాన్ని దాటవేస్తున్నదని ఆయన వివరించారు.