Begin typing your search above and press return to search.

ట్రిపుల్ త‌లాక్ వ‌ద్దంటు 10 ల‌క్ష‌ల సంతాకాలు

By:  Tupaki Desk   |   18 March 2017 9:59 AM GMT
ట్రిపుల్ త‌లాక్ వ‌ద్దంటు 10 ల‌క్ష‌ల సంతాకాలు
X
వివాదాస్ప‌ద ట్రిపుల్ త‌లాక్‌ విధానానికి వ్య‌తిరేకంగా ముస్లిం మ‌హిళ‌లు ఉద్య‌మించారు. దేశ‌వ్యాప్తంగా ట్రిపుల్ త‌లాక్‌ను వ్య‌తిరేకిస్తూ దాదాపు పది ల‌క్ష‌లకు పైగా ముస్లిం మ‌హిళ‌లు పిటీష‌న్‌పై సంత‌కం చేశారు. రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్‌కు అనుసంధాన‌మైన ముస్లిమ్ రాష్ట్రీయ మంచ్ ఈ సంత‌కాల సేక‌ర‌ణ‌ను మొద‌లుపెట్టింది. ట్రిపుల్ త‌లాక్‌ను ర‌ద్దు చేయాల‌ని పిటీష‌న్‌లో పిలుపునిచ్చారు. మూడు సార్లు త‌లాక్‌ అన‌గానే విడాకులు ఇచ్చే సంప్ర‌దాయాన్ని ర‌ద్దు చేయాల‌ని ఇప్ప‌టికే ముస్లిం మ‌హిళ‌లు సుప్రీంకోర్టులో పిటీష‌న్ వేశారు. ట్రిపుల్ త‌లాక్‌ను అనేక ముస్లిం దేశాలు బ‌హిష్క‌రించాయ‌ని కూడా ఇటీవ‌ల కేంద్ర మంత్రి ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్ అన్నారు.

ఇదిలాఉండగా ఇప్ప‌టికే ముస్లిం స‌మాజంలో నిర‌స‌న‌లు పెల్లుబుకుతున్నాయి. ఈ విధంగా తలాఖ్ ప‌దంతో విడాకులు ఇచ్చే పద్ధతికి వ్యతిరేకంగా 'భారతీయ ముస్లిం మహిళ ఆందోళన సంస్థ' తలాఖ్ పద్ధతికి వ్యతిరేకంగా వీరంద‌రినీ జ‌త‌చేసి పోరాడుతోంది. గ‌త ఏడాది 50 వేల మంది ముస్లింలు సంతకాలు చేశారు. మ‌హిళల ఆత్మ‌గౌర‌వానికి, ఆవేద‌న‌కు ఏ మాత్రం విలువ ఇవ్వ‌క‌పోవ‌డం బాధ‌క‌ర‌మ‌ని వారు ముస్లింలు వాపోతున్నారు. త‌లాక్‌ పద్ధతి దివ్య‌ ఖురాన్ కు సైతం వ్యతిరేకమని భారతీయ ముస్లిం మహిళ ఆందోళన సంస్థ స్ప‌ష్టం చేసింది. ముస్లిం మ‌హిళ‌ల‌ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని ఆయా వ‌ర్గాల‌కు చెందిన పెద్ద‌ల‌పై ఈ సంస్థ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. అఖిల భారత ముస్లిం మహిళ పర్సనల్ లాబోర్డ్ అధ్యక్షురాలు షయిషా అంబర్ త‌లాక్‌పై ఇటీవ‌ల స్పందిస్తూ త‌లాక్ పేరుతో విడాకులు ఇవ్వ‌డం ఇస్లాం వ్యతిరేకమని అన్నారు. ఈ విధానాన్ని నిర్వీర్యం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇది ఒక చెడ్డ సాంప్రదాయం అని పేర్కొన్న ష‌యిషా దానిని రద్దు చేయడానికి తాను అన్ని ప్రయత్నాలు చేస్తానని పేర్కొన్నారు.

కాగా ఇటీవ‌ల హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ త‌లాక్‌కు పూర్తి మ‌ద్ద‌తిస్తూ మాట్లాడారు. బూటకపు సర్వేలతో ముస్లింల సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆక్షేపించారు. తలాక్ విషయంలో తప్పుడు సర్వేలను తెరపైకి తెస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. త‌లాక్ విష‌యంలో 50వేల మంది ముస్లిం మహిళలను సర్వే చేసినట్టు చెబుతున్నారని, వాస్తవానికి కనీసం రెండు వేల మంది అభిప్రాయాలను కూడా సేకరించలేదని తమ దృష్టికి వచ్చిందని ఓవైసీ చెప్పారు. తలాక్ పేరుతో ముస్లిం మహిళలను అన్యాయానికి గురి చేస్తున్నారని, వారికి న్యాయం చేస్తామంటూ ప్రధాని నరేంద్ర డీ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/