Begin typing your search above and press return to search.

వైఎస్‌..కేసీఆర్‌ ల‌లో గొప్ప ఎవ‌రు? కేటీఆర్ జ‌వాబు ఇదే!

By:  Tupaki Desk   |   15 July 2018 11:24 AM GMT
వైఎస్‌..కేసీఆర్‌ ల‌లో గొప్ప ఎవ‌రు? కేటీఆర్ జ‌వాబు ఇదే!
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రాజ‌కీయ నాయ‌కులు ఉన్నా.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. సెన్సబుల్ గా స‌మాధానాలు ఇస్తూ అంద‌రి మ‌న‌సుల్ని దోచుకునే యువ‌నేత‌ల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒక‌రు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌తో పాటు.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో పాటు.. త‌న దృష్టికి వ‌చ్చే ఆస‌క్తిక‌ర‌మైన అంశాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు కేటీఆర్ పోస్ట్ చేస్తూ ఉంటారు.

ఇటీవ‌ల కాలంలో త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసే స‌మ‌స్య‌లకు వెనువెంట‌నే స్పందించ‌ట‌మే కాదు.. వాటి ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తుంటారు. తాజాగా ఆయ‌న‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఆస్క్ కేటీఆర్ హ్యాష్ ట్యాగ్ తో కేటీఆర్ ట్వీట్ చేశారు. ట్విట్ట‌ర్ లో ఆయ‌న చేప‌ట్టిన ఇంట‌రాక్ష‌న్ కు భారీ స్పంద‌న ల‌భించింది.

చాలామంది హైద‌రాబాద్ న‌గ‌ర‌జీవులు హైద‌రాబాద్ రోడ్ల గురించి..వాటి కార‌ణంగా తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి.. ఫుట్ పాత్ లు.. డ్రైనేజీ వ్య‌వ‌స్థ స‌రిగా లేదంటూ ప‌లు స‌మ‌స్య‌ల్ని ప్ర‌స్తావించారు. ఇలాంటి సీరియ‌స్ ఇష్యూల‌తో పాటు.. ఒక నెటిజ‌న్ క్లిష్ట‌మైన స‌మ‌స్య‌ను కేటీఆర్ ముందు ఉంచారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. కేసీఆర్్ ఇద్ద‌రిలో బెస్ట్ సీఎం ఎవ‌రు? అని ప్ర‌శ్నించారు. దీనికి కేటీఆర్ ఏమ‌ని బ‌దులిస్తారోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూసిన నెటిజ‌న్ల‌కు కేటీఆర్ చాలా తెలివిగా.. స‌మాధానం ఏమిటో మీకు తెలుసు అంటూ ఆన్స‌ర్ చేశారు.

ఆయ‌న ఇచ్చిన స‌మాధానం చిక్క‌డు.. దొర‌క‌డు అన్న‌ట్లుగా ఉంద‌న్న‌మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇక‌.. కేటీఆర్ స‌మాధానంపై ఎవ‌రికి వారు ఆన్వ‌యం చెప్పుకుంటూ.. కేసీఆర్ అని కొంద‌రు.. వైఎస్సార్ అని మ‌రికొంద‌రూ వ్యాఖ్యానించారు. వీరికి భిన్నంగా మ‌రికొంద‌రు మాత్రం ఆ ఇద్ద‌రిని పోల్చ‌లేమ‌ని కామెంట్ చేశారు. హైద‌రాబాద్ రోడ్ల విష‌యంలో ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న వేళ‌.. ట్విట్ట‌ర్ లో క్వ‌శ్చ‌న్ చేయ‌మ‌ని కేటీఆర్ కోర‌టం సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు.

నెటిజ‌న్లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ ఎలా స‌మాధానం ఇచ్చారో చూస్తే..

నెటిజ‌న్: వ‌చ్చే ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ లోని జూబ్ల‌హిల్స్.. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారా?
కేటీఆర్‌: సిరిసిల్ల నుంచే పోటీ చేస్తా

నెటిజ‌న్: 2024 ఎన్నిక‌ల్లో ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేసేఅవ‌కాశం ఉందా? (ఈ నెటిజ‌న్ గుంటూరుకు చెందిన వ్య‌క్తి)వ‌చ్చ‌
కేటీఆర్‌: భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో ఇప్పుడే చెప్ప‌లేం

నెటిజ‌న్: డిసెంరులో సాధార‌ణ ఎన్నిక‌లు వ‌స్తే ఎలా ఎదుర్కొంటారు?
కేటీఆర్: ఎన్నిక‌లు డిసెంబ‌రులో వ‌చ్చినా.. వ‌చ్చే ఏడాది వ‌చ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం

నెటిజన్: ఫుట్ బాల్ వ‌రల్డ్ క‌ప్ ఫైన‌ల్లో ఎవ‌రు గెలుస్తారు?
కేటీఆర్: ఎవ‌రు గెలిచినా ఆనంద‌మే.

నెటిజ‌న్: మీకు న‌చ్చిన బీర్ ఏంటి?
కేటీఆర్: ఆ విష‌యం చెప్ప‌ను

నెటిజ‌న్‌: అమ్మాయిల ప్ర‌శ్న‌ల‌కు మీరు రిప్లై ఇవ్వ‌టం లేదు (ఒక యువ‌తి ఈ ప్ర‌శ్న వేశారు)
కేటీఆర్: ఎంత ధైర్యం నాకు

నెటిజ‌న్: మీకు న‌చ్చిన ఫుట్ బాల్ ప్లేయ‌ర్ ఎవ‌రు?
కేటీఆర్: మెస్సీ

నెటిజ‌న్: మీకు ఇష్ట‌మైన క‌మెడియ‌న్ ఎవ‌రు?
కేటీఆర్: రాజ‌కీయాల్లో అడుతున్నావు క‌దా..( సూటిగా స‌మాధానం ఇవ్వ‌లేదు)

నెటిజ‌న్: త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ఎవ‌రు?
కేటీఆర్: కేసీఆర్‌

నెటిజ‌న్: మోడీ.. రాహుల్ గాంధీలో ఎవ‌రిని ఎంచుకుంటారు?
కేటీఆర్: ప్ర‌శ్న‌ను ప్ర‌శ్న‌గానే వ‌దిలేస్తున్నా

నెటిజ‌న్: తెలంగాణ‌లో కేటీఆర్.. మ‌రీ ఆంధ్రాలో ఎవ‌రు?
కేటీఆర్: కాలేజీ అయ్యాక ఖాళీలు ఫిల్ చేయ‌టం ఆపేశా