Begin typing your search above and press return to search.

''వ్యాపం'' బలి; మరొకరిని చంపేశారా..?

By:  Tupaki Desk   |   6 July 2015 8:37 AM GMT
వ్యాపం బలి; మరొకరిని చంపేశారా..?
X
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న వ్యాపం కుంభకోణంలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్న జర్నలిస్టు మృతి చెంది 24 గంటలు కాకముందే.. మరో ట్రైనీ ఎస్‌ఐ మృతి చెందటం పలు అనుమానాలకు తావిస్తోంది.

గత మూడు రోజుల వ్యవధిలో వ్యాపం కుంభకోణానికి సంబంధించి ఆరా తీసిన వారు.. దాని గురించి సమాచారం తెలిసిన వారిగా చెబుతున్న వారు ముగ్గురు మరణించటం గమనార్హం. తాజా మృతితో ఈ కుంభకోణం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 48కి పెరిగింది. ఈ స్కాం గురించి ఆరా తీసినా.. లేదంటే ఏ మాత్రం సమాచారం తెలిసినట్లు అర్థమవుతున్నా అనుమానాస్పదంగా మృతి చెందటం తెలిసిందే.

తాజాగా మహిళా ట్రైనీ ఎస్‌ఐ అనామికా కుష్వాహ మృతి చెందారు. ఒక ప్రముఖ టీవీ ఛానల్‌కు చెందిన ఇన్వెస్టిగేషన్‌ జర్నలిస్టు అనుమానాస్పదంగా మరణించి..జాతీయ స్థాయిలో ఈ ఉదంతంపై చర్చ జరుగుతున్న సమయంలోనే మరో పోలీసు అధికారిణి మృతి చెందటం సంచలనం సృష్టిస్తోంది.

కోట్లాది రూపాయిల వ్యాపం కుంభకోణంలో సాక్షులు.. నిందితులు వరుసగా అనుమానాస్పద రీతిలో మృతి చెందటం ఒక మిస్టరీగా మారుతుంటే.. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పెరిగిన విమర్శల జోరుతో.. ఈ కేసుపై సీబీఐ విచారణ కానీ.. మరెలాంటి విచారణకు అయినా న్యాయస్థానం ఆదేశిస్తే తమకు అభ్యంతరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. 48 మంది చనిపోయిన తర్వాతే సీబీఐ విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పటం ఏమిటో..?