Begin typing your search above and press return to search.

బ్రిటీష్‌ భామ.. ఏకంగా 30 ఐటెమ్‌లు

By:  Tupaki Desk   |   2 July 2015 6:51 AM GMT
బ్రిటీష్‌ భామ.. ఏకంగా 30 ఐటెమ్‌లు
X
బ్రిటీష్‌ మోడల్‌ స్కార్లెట్‌ విల్సన్‌ తెలుగు, తమిళ్‌ హిందీ ప్రేక్షకులకు సుపరిచితం. ఇప్పటికే 30పైగా ఐటెమ్‌ నంబర్లలో నర్తించింది. కేవలం బాలీవుడ్‌లోనే 25పైగా ఐటెమ్‌ నంబర్లలో నర్తించింది. టాలీవుడ్‌లో ఓ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఐటెమ్‌ బాంబ్‌గా ఆకట్టుకుంది.

అప్పట్లో చరణ్‌ నటించిన 'ఎవడు' చిత్రంలో ఓ ఐటెమ్‌లో నర్తించిన ఈ భామ ప్రస్తుతం 'బాహుబలి'లో తోటి ఐటెమ్‌ బామ(నోరా పథేహీ)లతో కలిసి అదిరిపోయే ఐటెమ్‌ నంబర్‌ చేసింది. అంతేనా ఇప్పుడు వెండితెరతో పాటు బుల్లితెరని కూడా ఏల్తోంది. స్కార్లెట్‌ విల్సన్‌ బ్రిటన్‌ నుంచి వస్తూనే బాలీవుడ్‌లో ంఘై చిత్రంలో అవకాశం అందుకుంది. ఆ చిత్రంలో కమారియా అంటూ ఆటాపాటతో కుర్రకారుకు వల వేసింది. అలా ప్రభుదేవా కళ్లలో పడి ఆర్‌.రాజ్‌కుమార్‌ చిత్రంలోనూ నర్తించింది. అంతేకాదు ఇప్పటివరకూ దాదాపు 25 ఐటెమ్‌ గీతాల్లో నర్తించింది అక్కడ. అట్నుంచి తమిళ్‌, తెలుగు పరిశ్రమల్లో ప్రవేశించింది.

వెండితెరపై ఓ వైపు అవకాశాలు అందుకుంటూనే వీలున్నంతవరకూ బుల్లితెరపైనా వెలిగిపోవాలని కలలు గంటోంది ఈ భామ. గత ఏడాది డేర్‌ 2 డ్యాన్స్‌ రియాలిటీ షోలో జడ్జిగా పాల్గొంది. ఇప్పుడుఝలక్‌ దికలాజాకి జడ్జిగా ఎంపికైంది. ఝలక్‌దికలాజా జడ్జిలుగా కరణ్‌జోహార్‌, మాధురీధీక్షిత్‌ ఆకట్టుకున్నారు. అదే తీరుగా ఇప్పుడు స్కార్లెట్‌ రూపంలో గ్లామర్‌ యాడైందన్నమాట!