Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ కమిట్‌మెంట్‌కి ఫిదా

By:  Tupaki Desk   |   29 Jun 2015 5:59 AM GMT
హీరోయిన్‌ కమిట్‌మెంట్‌కి ఫిదా
X
శ్రీలంకన్‌ బ్యూటీ జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌.. బాలీవుడ్‌లో సీక్వెల్‌ నాయికగా పాపులర్‌ అయ్యింది. మర్డర్‌ 2, రేస్‌ 2, హౌస్‌ఫుల్‌ 2 .. ఇలా సీక్వెల్స్‌లో నటించి ఆకట్టుకుంది. 2009లో అలాడిన్‌ అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఆరేళ్లలో డజను పైగా సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఉన్న యువనాయికలతో పోటీపడడంలో అమ్మడు రేసులో వెనకబడిందనే చెప్పాలి.

ఇటీవలే కండల హీరో సల్మాన్‌ ఎంకరేజ్‌మెంట్‌తో 'కిక్‌'లో ఛాన్సందుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించింది. అప్పట్నుంచి జాక్విలిన్‌కి అవకాశాలు పెరిగాయి. ఇప్పటికిప్పుడు నాలుగు సినిమాల్లో నటిస్తోంది. బంగిస్తాన్‌, బ్రదర్స్‌, డెఫినిషన్‌ ఆఫ్‌ ఫియర్స్‌ (హాలీవుడ్‌), అకార్డింగ్‌ టు మాధ్యూ (ఆంగ్ల చిత్రం) వంటి చిత్రాల్లో నటిస్తోంది. బ్రదర్స్‌లో పూర్తి స్థాయి నాయికగా కనిపించబోతోంది. ఈ మధ్యనే ఓ అవార్డుల కార్యక్రమం కోసం సీరియస్‌గా డ్యాన్సింగ్‌ రిహార్సల్స్‌ చేసిన ఈ భామకి చివరి నిమిషంలో మార్పులు చెప్పారు నిర్వాహకులు. దాంతో షాక్‌కి గురైనా వెంటనే తేరుకుని ఓ రాత్రంతా అదనపు ప్రాక్టీస్‌ చేసి షోని సక్సెస్‌ చేసింది.

కొన్ని తమిళ పాటలకు కూడా తనదైన డ్యాన్స్‌లతో రక్తి కట్టించి అహూతుల్ని రంజింపజేసింది. దీంతో కొరియోగ్రాఫర్స్‌ షైమాక్‌, మార్జి ఉబ్బితబ్బిబ్బయ్యారు. జాక్విలిన్‌ కమిట్‌మెంట్‌కి పడిపోయామంటూ కాంప్లిమెంట్‌ ఇచ్చారిద్దరూ. అదీ సంగతి.