Begin typing your search above and press return to search.

పెద్దమాట; కేసీఆర్‌కు మెచ్యురిటీ లేదా..?

By:  Tupaki Desk   |   25 May 2015 5:57 AM GMT
పెద్దమాట; కేసీఆర్‌కు మెచ్యురిటీ లేదా..?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ ఉద్యమకారులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణ ప్రభత్వంపై తమకున్న అసంతృప్తిని తీవ్ర పదజాలంతో మండిపడుతున్నారు. ఉస్మానియా భూముల్ని స్వాధీనం చేసుకొని.. అందులో పేదలకు భూములు కట్టించి ఇస్తానంటున్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఉస్మానియా భూముల ఎపిసోడ్‌లో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్‌ చెరుకు సుధాకర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

''వాస్తు కోసం సీఎం క్యాంప్‌ కార్యాలయాన్ని మార్చిన నీకు పరిపక్వత లేక.. విద్యార్థులకు మెచ్యూరిటీ లేదని మాట్లాడుతున్నావు. ఇలాంటి మాటలు మానుకోవాలి. కేసీఆర్‌ను ఎదిరించే దమ్ము ఓయూ విద్యార్థులకే ఉంది'' అంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి ఓయూ భూముల వ్యవహారంలో కేసీఆర్‌ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవటమే కాదు.. తనకు మద్ధతుగా నిలిచిన పలు పక్షాల నుంచి ఆయన వ్యతిరేకత ఎదుర్కొనటం గమనార్హం. తాను మొండివాడినని.. తాను అనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకూ వదిలిపెట్టనని చెప్పే కేసీఆర్‌.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న ఓయూ భూముల విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.