Begin typing your search above and press return to search.

ఉలిక్కిపడే వ్యాఖ్యలు; ఒక ఆవును చంపటమంటే..?

By:  Tupaki Desk   |   3 July 2015 8:09 AM GMT
ఉలిక్కిపడే వ్యాఖ్యలు; ఒక ఆవును చంపటమంటే..?
X
దేశ సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలియజెప్పటమే కాదు.. అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయన్న విషయాన్ని తాజా ఉదంతం చెప్పకనే చెబుతుంది. హిందువులు ప్రత్యక్ష దైవంగా కొలిచే ఆవుల్ని అక్రమంగా ఎగుమతి చేసే మిషన్‌పై కేంద్రం సీరియస్‌గా దృష్టి సారించింది. పశ్చిమబెంగాల్‌లోని సరిహద్దుల ద్వారా ప్రతి ఏటా దాదాపు 20 లక్షల ఆవుల్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ ఆక్రమ వ్యాపార విలువ ఏకంగా రూ.400కోట్లు కావటం గమనార్హం. దేవతగా కొలిచే ఆవును.. బంగ్లాదేశ్‌లో మాంసంగా భుజిస్తారు. ఈ గొడ్డు మాంసానికి విపరీతమైన డిమాండ్‌ ఉండి. దీంతో.. ఆవుల ఎగుమతిపై ఉన్న ఆంక్షల నేపథ్యంలో దొంగచాటుగా ప్రతి రోజు రాత్రివేళల్లో అక్రమంగా ఆవుల్ని తరలిస్తూ.. స్మగ్లర్లు కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నారు.

ఈ అంశంపై దృష్టి సారించిన కేంద్రం.. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ అక్రమ రవాణాను అడ్డుకోవటం కోసం దాదాపు 30వేల మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లను సరిహద్దుల వద్ద మొహరించింది.

తాజాగా చేపట్టిన ఈ చర్య కొంత ఫలితం ఇచ్చినట్లు చెబుతున్నారు. కొద్ది కాలంలోనే దాదాపుగా 90వేల ఆవుల్ని రక్షించటంతో పాటు.. దాదాపుగా 400 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇదే అంశాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నేత జిష్ణు మాట్లాడుతూ.. ఒక ఆవును చంపటం అంటే.. ఒక హిందు బాలికను అత్యాచారం చేయటం లేదంటే.. ఒక దేవాలయాన్ని నాశనం చేయటం లాంటిదంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయటం వాతావరణం మరింత వేడెక్కింది.

ఇంకోవైపు దొంగతనంగా తరలి వచ్చే ఆవుల మాంసానికి అలవాటు పడిన బంగ్లాదేశీయులు.. సరిహద్దుల్లో పరిస్థితి టైట్‌ కావటంతో ఆవు మాంసం కోసం ఆల్లాడిపోతున్నారట. ఈ కారణంగా ఆవు మాంసం ధరలు భారీగా పెరిగిపోయినట్లు చెబుతున్నారు. అత్యధికుల సెంటిమెంట్‌ను సంరక్షించాల్సిన బాధ్యతను మోడీ సర్కారు ఎంత సమర్థంగా నిర్వర్తిస్తుందో చూడాలి.