Begin typing your search above and press return to search.

వాళ్లపై కోట్ల వర్షం కురుస్తూనే ఉంది..!

By:  Tupaki Desk   |   23 May 2015 5:58 AM GMT
వాళ్లపై కోట్ల వర్షం కురుస్తూనే ఉంది..!
X
అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకొన్నారనే పేరే కానీ.. డబ్బు సంపాదన విషయంలో కానీ.. క్రేజీనెస్‌ విషయంలో కానీ ఇండియన్‌ లెజెండరీ క్రికెటర్ల స్థాయి ఏ మాత్రం తగ్గడం లేదు. భారత క్రికెట్‌ జట్టు తరపున దశాబ్దాల పాటు ఆడి.. కొంత కాలం క్రితమే రిటైర్‌మెంట్‌ ప్రకటించిన లెజెండరీ ప్లేయర్ల మరోసారి కోట్ల వర్షం కురిసింది. ఇప్పటికీ ఐపీఎల్‌, టీవీ వ్యాఖ్యాతలుగా బిజీగా ఉన్న క్రికెటర్లకు బీసీసీఐ మరో భారీ ప్యాకేజీని ప్రకటించింది.

ఫేమస్‌ ఫోర్‌గా పేరు గాంచిన సచిన్‌టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రావిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌లకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ కింద కోటిన్నర రూపాయల మొత్తాని ప్రకటించింది బీసీసీఐ. కొంతకాలం కిందట ఒకరి తరువాత ఒకరిగా రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన వీరికి ఈ డబ్బుదక్కనుంది. ఒకేసారి ఏక మొత్తంగా వీళ్లకు ఆ డబ్బు దక్కుతుందని బీసీసీఐ ప్రకటించింది.

భారత క్రికెట్‌ జట్టుకు దశాబ్దాల పాటు సేవలనందించిన వీళ్లకు ఈ విధమైన బెనిఫిట్స్‌ అందిస్తున్నట్టుగా బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. మరి ఇప్పటికే సచిన్‌, సౌరవ్‌ వంటి ఆర్థిక స్థాయి ఒక రేంజ్‌లో ఉంది.

క్రికెట్‌ ఆడుతున్న రోజుల్లో.. ఎండార్స్‌మెంట్‌ వెల్లువతో కోట్ల రూపాయలు సంపాదించిన వీళ్లు.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఇండియన్‌ ప్రీమియర్‌లీగ్‌తోనూ.. స్పోర్ట్స్‌ చానళ్ల వ్యాఖ్యాతలుగానూ బిజీగా ఉన్నారు. ఈ రకంగా కూడా వీళ్ల సంపాదన కోట్ల రూపాయల స్థాయిలోనే ఉంది. మరి ఇప్పుడు దానికి అదనంగా బీసీసీఐ మరో కానుకను ఇస్తోంది!