Begin typing your search above and press return to search.

వైసీపీ మిడిల్ డ్రాప్

By:  Tupaki Desk   |   30 Jun 2015 11:11 AM GMT
వైసీపీ మిడిల్ డ్రాప్
X
ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలను జగన్ పార్టీ వైసీపీ బహిష్కరించింది. ఆ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ విషయం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అక్రమాలను నిరసిస్తూ తాము ఎమ్మెల్సీ ఎన్నికలను బహష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు. అధికార పార్టీ ఇక్కడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్పడుతున్న అక్రమాలపై అందరికీ ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని... క్యాంపు రాజకీయాలకు పాల్పడిన టీడీపీ నేతలకు పోలీసులు కూడా అండగా నిలిచారని వాఉ ఆరోపించారు. ఎన్నికల కమిషనర్‌కు, గవర్నర్‌కు తాము ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారన్నారు.

ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడానికి కోట్ల రూపాయాలు ఖర్చు చేసి ఎంపిటిసీ సభ్యులను కొనేశారని... తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారని వారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా లేకపోవడం వల్ల తాము వాటిని బహిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. అయితే.. గెలుపు అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో పరాజయం పాలై పరాభవం పాలవడమెందుకున్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి వైసీపీ ఈ ఎన్నికల్లో మిడిల్ డ్రాపయినట్లయింది.