Begin typing your search above and press return to search.

మణిశర్మతో రౌడీఫెలో పిల్ల

By:  Tupaki Desk   |   2 July 2015 1:30 PM GMT
మణిశర్మతో రౌడీఫెలో పిల్ల
X
నారా రోహిత్‌ సరసన రౌడీ ఫెలో చిత్రంలో నటించింది విశాఖ సింగ్‌. అసలు ఎవరీ పిల్ల అని ఎంక్వయిరీ చేస్తే విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్న ఓ బిజినెస్‌ మ్యాగ్నెట్‌ డాటర్‌ అని తెలిసింది ఆ తర్వాత. మేనేజ్‌మెంట్‌ వంటి పెద్ద చదువులు చదువుకున్న విశాఖ సినిమాపై ప్యాషన్‌తో ఇటొచ్చింది. కథానాయికగా వెలిగిపోవాలనుకుంది. కెమెరా వెనక అవసరమైన ట్రైనింగ్‌ కూడా తీసుకుంది. అనూహ్యంగా రోహిత్‌ సరసన అవకాశం అందుకుంది.

ఆ తర్వాత తెలుగులో బిజీ అయిపోతుందనుకుంటే ఈలోగానే కేన్స్‌ ఫిలింఫెస్టివల్‌లో జ్యూరీ కమిటీ సభ్యురాలిగా ఎంపికై అందరికీ షాకిచ్చింది. విశాఖ మల్టీ ట్యాలెంటెడ్‌ గాళ్‌. అందుకే తక్కువ టైమ్‌లో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళంలోనూ ఓ చెయ్యేస్తోంది. అక్కడ ఒరు ఊర్ల రెండు రాజా చిత్రంలో ప్రియా ఆనంద్‌తో పాటు ఒక లీడ్‌ క్యారెక్టర్‌లో నటించింది. ప్రస్తుతం మణిశర్మ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో హారర్‌ చిత్రంలో నటించడానికి సంతకం చేసింది. ఇటీవలి కాలంలో తాప్సీ, త్రిష, నయన్‌ ఇలా నాయికలంతా హారర్‌ బాట పట్టడం ఈ అమ్మడిలో ప్రేరణ కలిగించిందో ఏమో.. ఇప్పటికి హారర్‌ చిత్రానికి సంతకం చేసింది.

త్వరలోనే మున్నార్‌లో షూటింగులో జాయిన్‌ అవుతోంది. అన్నట్టు మణిశర్మ అంటే మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనుకునేరు. ఇతగాడు 'ఈరమ్‌' (ఆది, సింధుమీనన్‌ నాయకానాయికలు) ఫేం అరివఝగన్‌ వద్ద అసోసియేట్‌గా పనిచేశాడు. ఇప్పుడు హారర్‌ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభిస్తున్నాడు. అదీ సంగతి.