Begin typing your search above and press return to search.

వాస్తు ఎఫెక్ట్‌; బాబు రూటు మారిందెందుకు?

By:  Tupaki Desk   |   30 Jun 2015 6:02 AM GMT
వాస్తు ఎఫెక్ట్‌; బాబు రూటు మారిందెందుకు?
X
మిగిలిన విషయాల్లో ఎలా అయితే పోటీ పడతారో.. నమ్మకాల విషయంలోనూ తెలంగాణ.. ఆంధ్రా ముఖ్యమంత్రులిద్దరూ పోటాపోటీ పడుతున్నారు. వాస్తుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఇద్దరు సీఎంలు.. తమకు ఎదురు దెబ్బలు ఎదురైన ప్రతిసారీ.. వాస్తు ప్రకారంగా ఉన్నామా? లేమా? అన్న ప్రశ్నల్నిసంధిస్తారని చెబుతుంటారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రూటు ఛేంజ్‌ వాస్తు ఎఫెక్ట్‌గా చెబుతున్నారు.

జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 24లోని తన అద్దె ఇంటికి వెళ్లి వచ్చే మార్గం నుంచి కాకుండా.. తాజాగా మరో రూట్‌ నుంచి ప్రయాణం చేయటం చర్చగా మారింది. వారం వరకూ ఒకే విధంగా ఉన్న రాకపోకలు తాజాగా మారటానికి కారణం ఏమిటన్న విషయంపై ఆరా తీస్తే.. ఆసక్తికరమైన విషయాల్ని చెబుతున్నారు. ఇప్పటివరకూ గేటు నెంబరు 1 నుంచి బాబు వచ్చిపోయేవారు. అందుకు భిన్నంగా ఇప్పుడు గేటు నెంబరు 2 నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.

తాజాగా వాస్తు పండితుల సూచన మేరకే ఈ మార్పు జరిగిందని చెబుతున్నారు. గేటు నెంబరు 1 నుంచి రాకపోకలు సాగిస్తే వాస్తు బాగోక.. ఓటుకు నోటు లాంటి చికాకులు వచ్చి పడతాయని.. గేటు నెంబరు 2 నుంచి వచ్చి వెళుతుంటే.. వాస్తు పక్కాగా ఉండటమే కాదు.. బాబుకు తిరుగు ఉండదని చెప్పటంతో వెంటనే రూట్‌ని మార్చేసినట్లు చెబుతున్నారు.