Begin typing your search above and press return to search.

విడాకుల ఇంటర్యూపై వాణి ఫైర్‌

By:  Tupaki Desk   |   3 July 2015 7:38 AM GMT
విడాకుల ఇంటర్యూపై వాణి ఫైర్‌
X
తొలి భార్య వాణీ గణపతికి విడాకులు ఇవ్వడం వల్లే తాను నాశనమయ్యానని విశ్వనటుడు కమల్‌హాసన్‌ ఇటీవలే ఓ పబ్లిక్‌ ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా చెప్పారు. వాణీతో విడాకులు, డబ్బు సెటిల్‌మెంట్‌ (అలిమ్నీ, విడాకులు కారణంగా భార్యకు చెల్లించేది) కారణంగా 'జీరో బ్యాంక్‌ బ్యాలెన్స్‌'కి పడిపోవాల్సొచ్చిందని అన్నాడు. అంతేనా ఓ అద్దె గదిలోకి దిగాల్సొచ్చిందని చెప్పాడు.

తనయురాలు శ్రుతిహాసన్‌ సమక్షంలో ఓ ప్రముఖ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్‌ పైవిధంగా స్పందించారు. అయితే దీనికి ఇంతకాలానికి అట్నుంచి రిప్లయ్‌ వచ్చింది. కమల్‌ మాటల్ని ఖండిస్తూ వాణీ గణపతి మీడియా కెక్కారు. విడాకులుతో భార్యని సెటిల్‌ చెయ్యడం అన్నది ఇండియన్‌ చట్టంల ఉందా అసలు? ఆ టైమ్‌లో కమల్‌హాసన్‌ ఉంటున్నది ఓ అద్దెగదిలో. 1978-88 కాలంలో మేం భార్యా భర్తలుగా కలిసి జీవించాం. ఓ రెండు అద్దె కొంపలు మారాం. అప్పటికి అసలు మాకు సొంత ఇల్లు ఎక్కడిది. పైగా కమల్‌ సోదరుడు చారుహాసన్‌ కుటుంబం పెద్ద చిక్కుల్లో పడింది. ఆ టైమ్‌లో వారికి అండగా నిలిచాను. ఇవన్నీ వదిలేసి నాపై అవాకులు చెవాకులు ప్రచారం చేస్తున్నాడంటూ మండిపడింది వాణి.

పైగా ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తున్నాడంటే అది కూతురి దగ్గర సింపథీ కొట్టేయడానికే. మర్చిపోయిన విషయాన్ని ఇలా ప్రచారం చేయడం తగదని వాణీ గణపతి ఫైరయ్యారు. విడాకులు తర్వాత దాదాపు 28ఏళ్లు ముగిసింది. ఇప్పటికి ఈ వివాదం చినికి చినికి గాలివానవ్వడం చెన్నయ్‌లో చర్చకొచ్చింది.