Begin typing your search above and press return to search.

పవన్‌ ఇంట్లోకి వెళతారా?.. ఆందోళన చేస్తారా?

By:  Tupaki Desk   |   30 Jun 2015 6:18 AM GMT
పవన్‌ ఇంట్లోకి వెళతారా?.. ఆందోళన చేస్తారా?
X
మిగిలిన కాంగ్రెస్‌ నేతలు ఎంతమంది ఉన్నా.. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత.. రాజ్యసభ సభ్యుడు వీహెచ్‌ హనుమంతరావు తీరే వేరు. ఆయన మాట్లాడే మాటలు కాస్తంత చిత్రంగా.. మరికాస్త విచిత్రంగా ఉంటాయి. ఇష్యూ ఏదైనా సరే.. ఆయన నోటి నుంచి వస్తే అది ఆసక్తికర వార్తగా మారిపోతుంది.

తాజాగా ఆయన గురి పవన్‌కల్యాణ్‌ మీద పడింది. సమస్య ఏదైనా తాను ప్రశ్నిస్తానని? ప్రశ్నించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్‌కల్యాణ్‌ను తాను ప్రశ్నిస్తానని చెబుతున్నారు వీహెచ్‌.

అవినీతిని అడ్డుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేసిన వీహెచ్‌.. ఈ వ్యవహారంపై పవన్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు. సమస్యలపై ప్రశ్నిస్తానని చెప్పి ఇప్పుడు మౌనంగా ఉండటమేమిటని నిలదీస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాను మరో రెండు రోజుల్లో ఓటుకు నోటు వ్యవహారంపై స్పందిస్తానని చెప్పిన సమయంలోనే వీహెచ్‌ రియాక్ట్‌ కావటం గమనార్హం.

పవన్‌ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిన వీహెచ్‌.. ఒకో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. తాను వేసిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు.. పవన్‌ ఇంటికి వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. తనను పవన్‌ ఇంటి లోపలికి రానిస్తే.. చర్చలు జరుపుతానని.. ఒకవేళ రానివ్వకపోతే మాత్రం ఇంటి ముందు ఆందోళన చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. అయిన ఇంత పెద్ద సీనియర్‌ అయి ఉండి ప్రశ్నించటానికి పవన్‌ ఇంటి ముందుకు వెళ్లాలా? నిజానికి అంత అవసరం ఉందా..? రెండు రోజులు ఆగితే.. పవన్‌ నోటి నుంచే సమాధానాలు రానున్నాయి కదా..?