Begin typing your search above and press return to search.

తులసిరెడ్డి మళ్లీ డ్యూటీలోకి ఎక్కాడు..!

By:  Tupaki Desk   |   23 May 2015 5:55 AM GMT
తులసిరెడ్డి మళ్లీ డ్యూటీలోకి ఎక్కాడు..!
X
చాన్నాళ్లుగా ఆయన పేరు మీడియాలో కనిపించడం లేదు. కాంగ్రెస్‌ హయాంలో అనునిత్యం టీవీ చానళ్లలో కనిపించే వాడు... ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలతో ఈయన వార్తల్లోకి వచ్చేవాడు. ప్రత్యేకించి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడంలో తులసిరెడ్డి చాలా ముందుండేవాడు. కిరణ్‌కుమార్‌ రెడ్డికి నమ్మిన బంటుగా కనిపించాడప్పట్లో!

అందుకు తగ్గట్టుగా కిరణ్‌ కొత్త పార్టీ పెట్టగానే తులసిరెడ్డి అటువైపు వెళ్లిపోయాడు. సమైక్యాంధ్ర పార్టీలో చేరిపోయాడు. ఆ పార్టీలో ఉండి.. అటు కాంగ్రెస్‌, ఇటు తెలుగుదేశం, జగన్‌ మోహన్‌రెడ్డిలపై దుమ్మెత్తిపోశాడు. అయితే అదంతా గతం.

ఎన్నికల తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉండిన తులసిరెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకొన్నాడు. ఎక్కడెక్కడో తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశాడు. మరి వచ్చాకా కూడా కొంతకాలం సైలెంట్‌గానే ఉన్న ఈయన ఇప్పుడు నోరువిప్పాడు.

ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశాడు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఖండించాడు. బాబు ప్రభుత్వం నయవంచక దీక్షలు చేస్తోందని తులసిరెడ్డి అన్నాడు. బాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు తప్ప ఆయనకు ప్రజాసంక్షేమం గురించి ఏం పట్టడం లేదని తులసిరెడ్డి పీసీసీ నేత హోదాలో వ్యాఖ్యానించాడు.

మరి ఈ వ్యాఖ్యల, విమర్శల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు ఈయన తిరిగి కాంగ్రెస్‌ నేత హోదాలో ప్రత్యర్థులపై విమర్శలు చేయడమే చెప్పుకోదగిన అంశం. మరి ఈయన ఇకపై ఇదే హోదాలో కొనసాగుతాడా? లేక మళ్లీ పక్కచూపులు చూసే అవకాశం ఉందా?!