Begin typing your search above and press return to search.

కాస్టింగ్‌ ఎంపికలో త్రివిక్రమ్‌ తర్వాతే!

By:  Tupaki Desk   |   2 July 2015 5:31 AM GMT
కాస్టింగ్‌ ఎంపికలో త్రివిక్రమ్‌ తర్వాతే!
X
త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ .. టాలీవుడ్‌ని ఏల్తున్న స్టార్‌ డైరెక్టర్‌ కం రైటర్‌. మాటల మాంత్రికుడిగా పాపులర్‌. అంతేనా ఇప్పుడు ఇతగాడిని వేరే కోణంలోనూ విశ్లేషిస్తున్నారు కొందరు. త్రివిక్రమ్‌ కాస్టింగ్‌ ఎంపికలో అభిరుచి ఉన్న దర్శకుడు. ఫలానా క్యారెక్టర్‌కి ఫలానా గ్లామర్‌ అద్దితేనే ఫ్రేముకి కళ వస్తుందని భావించే దర్శకుడిగా పాపులర్‌ అవుతున్నాడు. అతడి సినిమాల్ని పరిశీలిస్తే కుటుంబ సమేతంగా చూడదగ్గ కథల్ని ఎంచుకుని అందులో గ్లామర్‌తో నిండిన క్యారెక్టర్లను రంగంలోకి దించి తెలుగు ప్రేక్షకుల కళ్ల ముందు మెరుపులు మెరిపిస్తున్నాడు. అక్క, వదిన, ఆంటీ క్యారెక్టర్లకు అలనాటి మేటి హీరోయిన్లను రంగంలోకి దించి ఫ్రేముకి కళ తెస్తున్నాడు. ఈ విజువల్‌ సెన్స్‌ వల్లే అతడి సినిమాలకు అటు కుటుంబ ప్రేక్షకులు, ఇటు యూత్‌ ఆకర్షితులవుతున్నారన్నది విశ్లేషకుల సర్వే.

ఇటీవలి కాలంలో అతడు తెరకెక్కించిన మూడు సినిమాల్ని పరిశీలిస్తే.. అత్తారింటికి దారేది చిత్రంలో నాటి కథానాయిక నదియాని అత్తగా ఎంపిక చేసుకుని వన్నెచిన్నెలు పెంచాడు. కుర్ర హీరోయిన్ల మధ్య వేడెక్కించే అత్తగా కనిపించింది నదియా. యూత్‌ ఇటు సమంత, ప్రణీతలకు ఆకర్షితమవుతూనే ఆంటీ నదియాకి పడిపోయారు. ఫలితం ఆ సినిమా టాలీవుడ్‌ రికార్డుల్ని బ్రేక్‌ చేసింది. ఆ తర్వాత బన్ని నటించిన 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో మరింత డోస్‌ పెంచాడు. బన్ని సరసన ఏకంగా ముగ్గురు అందమైన అమ్మాయిల్ని చూపించాడు. దాంతో పాటే బన్నికి అక్క పాత్రలో సింధు తులానీని, ఉపేంద్ర భార్య పాత్రలోకి స్నేహని రంగంలోకి దించాడు. ఇటు సమంత, అదాశర్మ, నిత్యామీనన్‌ల హాట్‌ అప్పియరెన్స్‌, అటు సింధు, స్నేహల వయ్యారాలు కన్నుల పండువ చేశాయి. ఏ ఫ్రేమ్‌ చూసినా రంగుల మయంగా యూత్‌కి కనిపించింది. ఇప్పుడు మరోసారి పవన్‌ కల్యాణ్‌తో సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడు ఈ మాయావి. అందులో కాస్టింగ్‌ డీటెయిల్స్‌ ఇంకా తెలియదు కానీ.. ఇటీవలే యాంకర్‌ కం సింగర్‌ సునీతను ఓ మెరుపులాంటి పాత్ర కోసం ఎంపిక చేసుకున్నాడని తెలిసింది. ఒకవేళ పవన్‌ సినిమా అంటే ప్రతి ఫ్రేమూ రంగుల మయమే. ఆంటీలు, అందాల భామలు ఆకట్టుకునేవాళ్లే. కాబట్టి వన్నె చిన్నెల ఆంటీల్ని, వయ్యారాల అమ్మళ్లను ఫ్రేములోకి దించి హిట్ల మీద హిట్లు కొడుతున్నాడన్నమాట! ఇప్పుడు తెలిసిందా త్రివిక్రముని విజయం వెనుక దాగి ఉన్న సీక్రెటు.