Begin typing your search above and press return to search.

నితిన్‌తో త్రివిక్రమ్‌... నిజమా?!

By:  Tupaki Desk   |   3 July 2015 8:54 AM GMT
నితిన్‌తో త్రివిక్రమ్‌... నిజమా?!
X
త్రివిక్రమ్‌ తదుపరి సినిమా ఎవరితో చేస్తాడో తొందరగా చెబితేనే బాగుంటుంది. లేదంటే చిరంజీవి 150వ సినిమాకి ఆయనే దర్శకుడంట అన్న ప్రచారం మొదలైనా అవ్వొచ్చు. 'సన్నాఫ్‌ సత్యమూర్తి' ఎప్పుడైతే పూర్తయిందో అప్పట్నుంచి త్రివిక్రమ్‌ చేయబోయే కొత్త సినిమా గురించి బోలెడన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మొదట మహేష్‌తో అన్నారు, ఆ తర్వాత పవన్‌తో అన్నారు. వారిద్దరూ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ కావడంతో ఇక వేరే దారిలేక త్రివిక్రమ్‌ ఓ చిన్న సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నాడని చెప్పుకొన్నారు. అది లేడీ ఓరియెంటెడ్‌ సినిమా అనీ, అందులో సమంత నటించబోతోందని కూడా వార్తలొచ్చాయి. ఇప్పుడేమో నితిన్‌ పేరు వినిపిస్తోంది. మరి ఇదైనా నిజమో కాదో చూడాలి.

నాగచైతన్య కానీ నితిన్‌ కానీ .... వీళ్లిద్దరిలో ఒకరితో సినిమా చేయాలని త్రివిక్రమ్‌ స్క్రిప్టుని తయారు చేశాడట. ఫైనల్‌గా నితిన్‌ని ఎంచుకొన్నాడట. త్వరలోనే ఈ కాంబినేషన్‌లోనే సినిమా తెరకెక్కబోతోందని ప్రచారం సాగుతోంది. మరి ఇది ఖచ్చితమైన వార్తో కాదో త్వరలోనే తేలిపోనుంది. ఎందుకంటే త్రివిక్రమ్‌కి కూడా ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు. కథానాయకులంతా ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. మహేష్‌, పవన్‌లు ఖాళీ అయ్యేలోపు ఓ సినిమా తీయాలనైతే త్రివిక్రమ్‌ గట్టిగానే అనుకొంటున్నారు. సో... బయట చెప్పుకొంటున్నట్టుగా నితిన్‌తోనే ఆ సినిమా ఉంటుందేమో చూడాలి. అదేగనక నిజమైతే నితిన్‌ జాక్‌పాట్‌ కొట్టినట్టే.