Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్‌ కలల ప్రపంచంలోకి నితిన్‌

By:  Tupaki Desk   |   30 Jun 2015 4:26 PM GMT
త్రివిక్రమ్‌ కలల ప్రపంచంలోకి నితిన్‌
X
అవును.. త్రివిక్రమ్‌ ఓ కలల ప్రపంచం నిర్మించాడు. 'సన్నాఫ్‌ సత్యమూర్తి' తర్వాతే ఆ కలల ప్రపంచం నిర్మాణం జరిగింది. సత్యమూర్తి.. రిజల్ట్‌ కొంచెం తేడాగా వచ్చేసరికి ఒక్కసారిగా పెద్ద హీరోలు అతణ్ని పట్టించుకోవడం మానేశారంటూ ప్రచారం మొదలైంది. ఇక అప్పట్నుంచి త్రివిక్రమ్‌ చేయబోయే సినిమాల గురించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ముందు మహేష్‌తో సినిమా అన్నారు. కానీ మహేష్‌ వెనక్కి తగ్గాడట. తర్వాత పవన్‌తో సినిమా అన్నారు. కానీ అతడికీ ఖాళీ లేదట. ఆ తర్వాత హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ రేంజికి తీసుకొచ్చేశారు త్రివిక్రమ్‌ను. అందులో సమంత లీడ్‌ రోల్‌ అని కూడా చెప్పారు. ఆ వార్త కూడా రూమరే అని తేలిపోయింది.

ఇప్పుడు త్రివిక్రమ్‌ లో బడ్జెట్‌లో ఓ సినిమా తీయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో హీరోలుగా నాగచైతన్య, నితిన్‌ రేసులో ఉన్నారట. నాగచైతన్య ఈ ప్రాజెక్టు మీద మరీ అంత ఆసక్తిగా ఏమీ లేడట. నితిన్‌ మాత్రం తెగ ఉత్సాహం చూపిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఐతే వాస్తవానికి త్రివిక్రమ్‌తో సినిమా అంటే ఇప్పటికీ పెద్ద హీరోలెవ్వరైనా రెడీనా. కాకపోతే వేరే సినిమాల కమిట్మెంట్ల వల్ల త్రివిక్రమ్‌తో చేయడానికి అవకాశం లేకపోయింది. ఒకవేళ నాగచైతన్య అయినా సరే.. త్రివిక్రమ్‌తో సినిమా అంటే ఎగిరి గంతేయడూ. ఇక్కడ ఛాయిస్‌ త్రివిక్రమ్‌దే అయి ఉంటుంది. చేయడానికి అవకాశమున్న హీరోలెవ్వరూ త్రివిక్రమ్‌కు నో చెప్పే ఛాన్సే లేదు.