Begin typing your search above and press return to search.

సొసైటీ గురించి పెళ్లి చేసుకోకండి -త్రిష

By:  Tupaki Desk   |   2 July 2015 11:30 AM GMT
సొసైటీ గురించి పెళ్లి చేసుకోకండి -త్రిష
X
నిశ్చితార్థం పూర్తయ్యాక పెళ్లి ఆగిపోయిందంటే ఆ మగువకు, కుటుంబ సభ్యులకు ఎంత అవమానం? కానీ త్రిష అవేమీ తనకి పట్టనట్టే ఉండిపోయింది. వరుణ్‌ మణియన్‌తో పెళ్లికి ముందే పెటాకులు అన్న వార్త తనని ఎంత మాత్రం కదిలించలేదు. సరికదా.. హ్యాపీగా ఫీలైంది. తనకి వరుణ్‌తో కుదరలేదు. పెళ్లి వద్దనుకుంది. తనకి మగని కంటే కెరీరే ముఖ్యం. సినిమాలతోనే కాపురం. ఆ సంగతిని ట్వీట్‌లతోనే అభిమానులకు అర్థమయ్యేలా చెప్పింది. ఈ సందర్భంగా త్రిష కొన్ని ఆసక్తికర సంగతుల్ని వివరించిందిలా...

పెళ్లి ఆగిపోయాక బోలెడన్ని కథలు.. వాటన్నిటినీ ఎలా భరించారు?

హృదయం, మెదడు రెండిటినీ ఒకేసారి వాడి ఆలోచించడం నాకు మొదటి నుంచీ అలవాటు. అలాంటి సన్నివేశాన్ని సగటు అమ్మాయి అయితే తట్టుకోవడం కష్టం. కానీ నేను అలాంటిదాన్ని కాను. ఆ సందర్భంలో అమ్మానాన్న, బంధువులు ఇచ్చిన సపోర్ట్‌ని మరువలేను. తొలినుంచి పాజిటివ్‌ యాటిట్యూడ్‌ నన్ను ఇలా నిలబెట్టగలిగింది.

పెళ్లి ఆగిపోయాక బోలెడన్ని కొత్త పరిణామాలు

అవును. నా పెళ్లి ఆగిపోవడం వెనక బోలెడంత మంది ఇన్వాల్వ్‌ అయ్యారని వార్తలొచ్చాయి. ఆ పేర్లన్నీ చెప్పడం, స్మరించుకోవడం నాకిష్టం లేదు. అయినా ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. దేనినీ ఎవరితోనూ షేర్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను సమాధనం చెప్పాలి అనుకుంటే అది నా తల్లికి మాత్రమే. ఆ విషయంలో క్లారిటీ ఉంది. అంతేకాదు పెళ్లి ఆగిపోయాక కూడా నేను సంతోషంగానే ఉన్నా.

మీ పెళ్లి విషయంలో మిగతా జనం గోలేంటో?


చాలామంది పెళ్లిల్లు సమాజం కోసమే చేసుకుంటారు. తమకి నచ్చినవారితో చేసుకోవాలన్న రూలేం లేదు. కానీ నేను అలా కాదు. ఒకవేళ నేను 25 వయసులో ఉన్నప్పుడే ఎవరితో అయినా ప్రేమలో పడితే ఇంతకాలం వేచి చూసి ఇప్పుడు చేసుకునేదాన్ని. అసలు పెళ్లి విషయంలో సొసైటీని పట్టించుకునేదాన్ని కాదు. నా కోసం నేను బతుకుతున్నా అంతే.

ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు?

కమల్‌హాసన్‌ సరసన 'చీకటిరాజ్యం' చిత్రంలో నటిస్తున్నా. బలమైన స్క్రిప్టుతో తెరకెక్కుతున్న చిత్రమిది. మన్మధన్‌ అంబు తర్వాత కమల్‌ సర్‌ సరసన మరో ఛాన్స్‌ దక్కినందుకు ఆనందంగా ఉంది. అలాగే ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ స్క్రిప్టులకు ప్రాధాన్యం పెరిగింది. అలాంటి ఎగ్జయిట్‌ చేసే కథలు వస్తే నటించడానికి సిద్దమే.