Begin typing your search above and press return to search.

త్రిష ఎంత హ్యాపీగా ఉందో చూశారూ!

By:  Tupaki Desk   |   24 May 2015 10:30 PM GMT
త్రిష ఎంత హ్యాపీగా ఉందో చూశారూ!
X
బ్రేకప్‌ అయితే అబ్బాయిలు దేవదాసులు అయిపోతారు.. అమ్మాయిలు మాత్రం చాలా లైట్‌ తీసుకుంటారు అని అంటుంటారు. త్రిష సంగతి చూసినా ఇలాగే ఉంది. ఆ మధ్య రానాతో బ్రేకప్‌ అయినప్పుడు అమ్మడిలో కించిత్‌ అయినా బాధ కనిపించలేదు. కొన్ని రోజులకే వరుణ్‌తో ప్రేమాయణం మొదలుపెట్టింది. ఎంచక్కా అతగాడితో కలిసి టూర్‌లు వేసింది. ఆపై ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. కానీ వరుణ్‌తో బంధానికి కూడా తెరదించేసిన త్రిష.. ఈసారి ఎంగేజ్మెంటే క్యాన్సిల్‌ అయినా రవ్వంత కూడా బాధలో ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా తానెంత హ్యాపీగా ఉన్నదీ ప్రపంచానికి చాటాలనుకుంటోంది.

ఈ మధ్యే త్రిష 'హండ్రెడ్‌ హ్యాపీ డేస్‌ ఛాలెంజ్‌' అనే ఓ కొత్త కాన్సెప్ట్‌కు ఓకే చెప్పింది. ఈ ఛాలెంజ్‌కు ఒప్పుకున్నవాళ్లు వంద రోజుల పాటు ఏ విషయానికి బాధ పడకుండా, ఏడవకుండా ఎప్పుడూ సంతోషంగా కనిపించాలి. జనాల్లో పాజిటివ్‌నెస్‌ పెంచేందుకు 'హండ్రెస్‌ హ్యాపీ డేస్‌' అనే సంస్థ నిర్వహిస్తున్న పోటీ ఇది. ఆ సంస్థ త్రిషను అడగ్గానే పోటీకి ఒప్పేసుకుంది. ''ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలనే ఈ ఛాలెంజ్‌ తీసుకున్నా. మీరు కూడా నాలా హ్యాపీగా ఉండగలరా'' అంటూ ట్విట్టర్లో ఈ ఛాలెంజ్‌ గురించి చెప్పుకొచ్చింది త్రిష. గతంలో 'నో మేకప్‌ ఛాలెంజ్‌' తీసుకుని మూడు నెలల పాటు మేకప్పే లేకుండా బయట తిరిగిన త్రిష.. ఇప్పుడీ కొత్త ఛాలెంజ్‌ తీసుకుంది. ఆమె ఎలాంటి ఛాలెంజ్‌ అయినా తీసుకోవచ్చు కానీ.. ఎంగేజ్‌మెంట్‌ బ్రేకప్‌ అయిన సందర్భంలో తీసుకోవడమే అవతలి వాళ్లకు మండించేలా ఉంది.