Begin typing your search above and press return to search.

ఏంటి మహేష్‌తో పోటీనా?

By:  Tupaki Desk   |   30 Jun 2015 1:36 PM GMT
ఏంటి మహేష్‌తో పోటీనా?
X
కలర్స్‌ స్వాతి ఇటీవలి కాలంలో బొత్తిగా నల్లపూస అయిపోయింది. నిఖిల్‌ సరసన వరసగా ఓ రెండు సినిమాల్లో నటించి హిట్లు కొట్టిన స్వాతి .. వేరే ఏ హీరోకీ కాల్షీట్లు ఇచ్చిందే లేదు. అయితే ఓ లేడీ ఓరియెంటెడ్‌ స్క్రిప్టుకి ఓకే చెప్పి తెలుగువారికి టచ్‌లో ఉంది. ప్రస్తుతం స్వాతి టైటిల్‌ పాత్రధారిగా 'త్రిపుర' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ కోన వెంకట్‌. గీతాంజలి ఫేం రాజ్‌కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

వాస్తవానికి ఈ సినిమాకి గీతాంజలి 2 పేరు వినిపించినా తర్వాత త్రిపుర అని ప్రకటించారు. స్వాతి త్రిపురగా భయపెట్టబోతోంది. హారర్‌ కామెడీ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్‌కి అభిమానుల నుంచి చక్కని స్పందన వచ్చింది. అలాగే ఈ సినిమా టాకీ పూర్తి కావచ్చింది. తదుపరి కొడైకెనాల్‌, పొలాచ్చిలో రెండు పాటల్ని తెరకెక్కిస్తారు. కోన వెంకట్‌ ఈ చిత్రానికి సహనిర్మాతగా కొనసాగడమే గాకుండా కథ, మాటలు అందించారు. అయితే ఈ చిత్రాన్ని జూలై నెలాఖరున రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

అంటే మహేష్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడుతో స్వాతి సినిమా పోటీపడబోతోందా? ఆగస్టు 7న శ్రీమంతుడు వస్తుంటే, ఓ వారం ముందు త్రిపుర వచ్చేస్తుందట. ఆ మేరకు స్వాతి డేరింగ్‌ గాళ్‌ అనే చెప్పాలి. కాని ఓ పెద్ద హీరో సినిమాతో ఇలా అతి దగ్గరగా పోటీపడే సత్తా స్వాతికి ఉందా? లేదా? అనేది తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.