Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ ఫ్యామిలీస్‌ ఏం చేస్తున్నాయ్‌?

By:  Tupaki Desk   |   25 May 2015 3:30 AM GMT
టాలీవుడ్‌ ఫ్యామిలీస్‌ ఏం చేస్తున్నాయ్‌?
X
టాలీవుడ్‌ని ఏల్తున్న ఓ ఐదు ఫ్యామిలీలు ప్రస్తుతం ఏం చేస్తున్నాయి? ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం పనిచేస్తున్నారు? ఆరాతీస్తే తెలిసిన వివరాలివి.

మెగా ఫ్యామిలీలో చిరంజీవి రాజకీయాల్ని పక్కనబెట్టి 150వ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఆగస్టు 22ముహూర్తం కాబట్టి, ఇప్పట్నుంచే బాడీలాంగ్వేజ్‌పై పక్కాగా కసరత్తు చేస్తున్నాడు. పవన్‌కల్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నా, గబ్బర్‌సింగ్‌ 2 కోసం రెడీ అవుతున్నాడు. చరణ్‌ శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమాతో బిజీ. సాయిధరమ్‌ ఎవడే సుబ్రహ్మణ్యం షూటింగు కోసం లండన్‌ వెళ్లాడు. బన్ని ప్రస్తుతం వేసవి తాపానికి దూరంగా సెలవుల్ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. శిరీష్‌ జిమ్ముల్లో కసరత్తులు చేసి 6ప్యాక్‌ పెంచుతున్నాడు.

ఇక దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్‌, డి.సురేష్‌బాబు కుటుంబ సమేతంగా కొడైకెనాల్‌ వెళ్లి సీతలపవనాల్ని ఆస్వాధిస్తున్నారు. రానా బెంగళూర్‌ డేస్‌ రీమేక్‌ కోసం చెన్నయ్‌ వెళ్లాడు. అలాగే మంచు కుటుంబం అంతా దొంగాట విజయాన్ని ఎంజాయ్‌ చేస్తూ ప్రణాళికల్లో ఉన్నారు. విష్ణు దేవకట్టా సినిమా తర్వాత వేరొక సినిమా కోసం కసరత్తు చేస్తున్నాడు. మనోజ్‌ పెళ్లి చేసుకుని విందువినోదాల్లో తేలుతున్నాడు. అలాగే అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఫుల్‌ బిజీ. నాగార్జున-అమల ఇటీవలే స్పెయిన్‌ వెళ్లి అఖిల్‌ యాక్షన్‌ని కళ్లారా చూసుకుని సంతృప్తితో తిరిగొచ్చారు. నాగార్జున ఓ వైపు సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నటిస్తూ, మరోవైపు కార్తీతో మల్టీస్టారర్‌లోనూ నటిస్తున్నాడు. చైతన్య గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో షూటింగ్‌కెళ్తున్నాడు. అఖిల్‌ స్పెయిన్‌లో బిజీ. సుశాంత్‌ షూటింగులో బిజీ. మిగతా ఫ్యామిలీ అంతా ఇతర వ్యాపారాల్లో బిజీ.

నందమూరి ఫ్యామిలీ విషయానికొస్తే.. ఫ్యామిలీలో బాలయ్య 99వ సినిమా డిక్టేటర్‌ కోసం రెడీ అవుతున్నారు. త్వరలోనే సెట్స్‌కెళ్లనుంది ఈ సినిమా. ఎన్టీఆర్‌ సుక్కూతో సినిమా కోసం, కళ్యాణ్‌రామ్‌ కిక్‌2 (నిర్మాతగా) ప్రచారం కోసం కసరత్తు చేస్తున్నారు. ఇవీ సంగతులు.