Begin typing your search above and press return to search.

టార్గెట్‌ 100పైకి మార్చండి గురూ

By:  Tupaki Desk   |   2 July 2015 1:30 AM GMT
టార్గెట్‌ 100పైకి మార్చండి గురూ
X
పెట్రోల్‌ రేటు రూపాయల్లో పెరిగి పైసల్లో తగ్గుతోంది. సినిమా ధియేటర్ల టిక్కెట్లు కూడా అన్నీ 100 నోటుకంటే పైకే ఎగబాకుతున్నాయి. హీరోయిన్స్‌ రెమ్యూనరేషన్స్‌తో పాట షూటింగ్‌ లొకేషన్స్‌ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఇక హీరోల ప్యాకేజీతో కలుపుకుంటే సినిమా మేకింగ్‌ కాస్ట్‌ కూడా పెరిగింది. మరి ఇన్నేసి విధాలుగా ఖర్చులు పెరుగుతున్నా కూడా.. ఓ నాలుగు సంవత్సరాల నుండి చూస్తే ఆదాయం మాత్రం కాన్‌స్టంట్‌గానే ఉంటోంది. వాటే కామెడీ గురూ.

టాలీవుడ్‌ 2015లో అప్పుడే సగం నెలలు గడిపేసినా, 50 కోట్లు కలెక్ట్‌ చేసిన సినిమా ఒక్కటే ఒక్కటి. సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి 51.9 కోట్లు వసూలు చేసింది. అయినా బయ్యర్లకు 2 కోట్లు నష్టం వచ్చింది, అది వేరే విషయం. అసలు మన సినిమా కెపాసిటీ కేవలం 50 కోట్ల షేర్‌ మాత్రమేనా? ఒకవేళ గ్రాస్‌ రూపంలో చూసుకున్నా ఈ సినిమాకు ఓ 90 కోట్ల చిల్లర మాత్రమే వచ్చింది. అంటే ప్రేక్షకులు దగ్గర నుండి వచ్చింది 90 కోట్లనమాట. మరి తెలుగు సినిమాలు 100 కోట్లు దాటేదెప్పుడు? షేర్‌ సంగతి సరే పోనివ్‌ గ్రాస్‌నైనా 100 కోట్లు దాటిస్తారా? ఒకవేళ బాహుబలి సినిమా ఈ 100 కోట్ల గ్రాస్‌ను తెచ్చేయవచ్చు. దాని కెపాసిటీ అలా ఉంది మరి. కాని ఆ తరువాత సీన్‌ ఏంటి? శ్రీమంతుడు, రుద్రమదేవి, చరణ్‌-శ్రీనువైట్ల, ఎన్టీఆర్‌-సుక్కూ, బన్నీ-బోయపాటి.. ఇలా ఎవరైనా ఆ 100 కోట్ల గ్రాస్‌ మార్క్‌ను టచ్‌ చేస్తారా?

నిజానికి టాలీవుడ్‌లో రెవెన్యూలు పెరగాలంటే.. పైరసీ మీద అరవడం కాదు, పబ్లిసిటీ పెంచి, సినిమాల్లో కంటెంట్‌ విలువను పెంచాలి అంటున్నారు విశ్లేషకులు. రొటీన్‌ కంటెంట్‌నే తీసి ఆడియన్స్‌ ఇదే కోరుకుంటున్నారు అని చెబితే దానికి పెద్దగా విలువ ఉండకపోవడమే కాదు.. చచ్చినా 50 కోట్ల షేర్‌ అనేది కూడా రాదు. ఇక 100 కోట్ల గ్రాస్‌ అలాంటి సినిమాలతో ఎక్కడొస్తుంది. చూద్దాం మరి.. స్టార్‌ డైరక్టర్లందరూ ఈ 100పైన ఏమైనా టార్గెట్‌ పెట్టుకొని పనిచేస్తారేమో.