Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోల టీ20 బ్యాటింగ్‌

By:  Tupaki Desk   |   29 Jun 2015 1:30 PM GMT
స్టార్‌ హీరోల టీ20 బ్యాటింగ్‌
X
ఒకప్పుడు ఏడాదికో, రెండేళ్లకో ఓ సినిమా చేసేవాళ్లు మన హీరోలు. కానీ రెండు మూడేళ్ల కిందట పరిస్థితి మారింది. ఏడాదికి రెండు సినిమాల టార్గెట్‌తో కొంచెం స్పీడు పెంచారు. కానీ అలా స్పీడు పెంచిన హీరోలందరికీ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. హడావుడిగా పూర్తి చేసిన సినిమాల రిజల్ట్‌ తేడా వచ్చేసింది. ఐతే ఇప్పుడు కొంచెం రూటు మార్చారు. షూటింగ్‌ కావాలంటే స్పీడుగా చేసేద్దాం.. కానీ స్క్రిప్టు విషయంలో మాత్రం రాజీ వద్దంటూ అందుకోసం దర్శకులకు, రచయితలకు బాగా టైం ఇస్తున్నారు హీరోలు. కావాలంటే ఎన్ని నెలలైనా ఖాళీగా ఉంటాం. కానీ స్క్రిప్టు మాత్రం పక్కాగా రెడీ అవ్వాల్సిందే అంటూ కండిషన్‌ పెడుతున్నారు హీరోలు. ఐతే ఒక్కసారి సినిమా సెట్స్‌పైకి వెళ్లిందంటే మాత్రం నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ చేసి సినిమా ఫినిష్‌ చేసేస్తున్నారు.

ముందుగా మహేష్‌ బాబు సంగతే చూస్తే 'ఆగడు' తర్వాత మూడు నెలలు ఖాళీగా ఉండిపోయాడతను. ఆ తర్వాత శ్రీమంతుడు మొదలు పెట్టి పూర్తి చేసే దాకా వదల్లేదు. రామ్‌చరణ్‌ కూడా శ్రీను వైట్ల సినిమా ప్రి ప్రొడక్షన్‌ విషయంలో ఓపిగ్గా ఉన్నాడు. పక్కాగా స్క్రిప్టు ఓకే అనుకున్నాక రంగంలోకి దిగి శరవేగంగా సినిమా పూర్తి చేస్తున్నాడు. ఎన్టీఆర్‌-సుకుమార్‌ల సినిమా వ్యవహారం కూడా ఇలాగే ఉంది. జులైలో షూటింగ్‌ మొదలుపెట్టి మూడు నెలలు ఏకధాటిగా షూటింగ్‌ చేయబోతున్నారట. మహేష్‌ 'బ్రహ్మూెత్సవం' విషయంలోనూ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. బన్నీ-బోయపాటి కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవబోతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ కూడా 'గబ్బర్‌సింగ్‌-2' మొదలెడితే ఇక ఆగడట. మొత్తానికి మన హీరోల వ్యవహారం టీ20 బ్యాటింగ్‌ లాగే ఉంది.