Begin typing your search above and press return to search.

తెలుగు సినిమా మూడు ముక్కలే

By:  Tupaki Desk   |   25 May 2015 1:30 AM GMT
తెలుగు సినిమా మూడు ముక్కలే
X
టాలీవుడ్‌ మూడుముక్కలైంది. ఇన్నాళ్లు మేమంతా ఒక్కటే అన్నవాళ్లు ఒక్కో వర్గం ఎవరికి తోచినట్టు వాళ్లు రాజకీయాలకు తెరలేపారు. ఏపీ సినిమా, తెలంగాణ సినిమా, 14మంది గ్రూపు సినిమా అన్నట్టు మూడుగా విడిపోయింది. ఇప్పటికే ఏపీ నుంచి బడా నిర్మాతలు, పంపిణీదారులు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు మన పరిశ్రమను మనమే అభివృద్ధి చేసుకుందాం అన్న ప్రణాళికలో ఉన్నారు.

దీనికి తోడు హైదరాబాద్‌ తెలుగు ఫిలింఛాంబర్‌లో ప్రాంతీయ గొడవలు ఎప్పటికప్పుడు రచ్చకెక్కుతుండడంతో ఈ ఉద్యమం ఏపీ వైపు ఊపందుకుని కొత్త పరిశ్రమ కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చింది. అలాగే తెలంగాణలో తెలంగాణ కల్చర్‌కి, తెలంగాణ యాక్సెంటుకి, తెలంగాణ హీరోయిజమ్‌కి సంబంధించిన సినిమాలే తీయాలన్న పట్టుదల లోకల్‌ నిర్మాతలకు, దర్శకులకు ఉంది. దీనివల్ల ఇక్కడ ప్రత్యేకించి కొందరు ఫిలింఛాంబర్‌లు, నిర్మాతల మండళ్లు, ఆర్టిస్టు అసోసియేషన్‌లు పెట్టుకున్నారు. మేం కలిసి ఉండం, విడిపోయాం అన్న సంకేతాలిచ్చారు. అదే టైమ్‌లో ఆ 14మందితో ఓ కొత్త గ్రూపు ఏర్పడింది. మేం పరిమిత బడ్జెట్‌ సినిమాలు తీస్తాం. మీడియాని కట్‌ చేస్తాం. రెండు చానెళ్లకు యాడ్లు అంటూ కొత్త గ్రూపు రభస మొదలెట్టింది. తెలుగు నిర్మాతల మండలికి ఈ గ్రూపుతో అస్సలు పొసగడం లేదు. దీంతో ఇప్పటికిప్పుడు మూడు గ్రూపులు కొట్టుకునే పరిస్థితి వచ్చింది.

ప్రాంతీయం పేరుతో రెండు గ్రూపులు, బడ్జెట్‌ అదుపు పేరుతో కొత్త గ్రూపు.. ఎవరికి వారు యమనా తీరే అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. సందట్లో సడేమియా అన్నట్టు ఈ మొత్తం లొల్లి వల్ల టాలీవుడ్‌ మరింత ధీనమైన స్టేజీకి పడిపోయింది. ఎవరికి వారు టాలీవుడ్‌ని ఏలాలని కలలు గంటున్నారు. ఓవైపు సక్సెస్‌ లేక, పెట్టబడులు రాక, పెట్టేవాళ్లు లేక, కొనేవాళ్లు లేక వినాశనం వైపు తీసుకెళ్తున్నారంతా.