Begin typing your search above and press return to search.

ఆ ఛమక్కు చురుక్కు ఎవరబ్బా??

By:  Tupaki Desk   |   26 May 2015 11:30 AM GMT
ఆ ఛమక్కు చురుక్కు ఎవరబ్బా??
X
నిన్నగాక మొన్ననే ఐపీఎల్‌ సీజన్‌ చివరిమ్యాచ్‌ ముగిసింది. ఫైనల్‌లో చెన్నయ్‌ సూపర్‌కింగ్స్‌ జట్టుపై ముంబై ఇండియన్స్‌ జయభేరి మోగించారు. ఐపీఎల్‌ కప్పు ఎగరేసుకుపోయారు. స్టేడియంలో మెరుపులే మెరుపులు. అయితే ఈ మెరుపులన్నిటి మధ్యా ఓ వజ్రం తళుకుబెళుకులు ఇప్పుడు చర్చకొచ్చాయి. ఈ టోర్నమెంట్‌ ఆద్యంతం ఓ వైపు స్టార్‌ క్రికెటర్లు, మరోవైపు సినీతారలు.. ఇంకోవైపు చీర్‌ లీడర్స్‌.. వేరొక వైపు కార్పొరెట్‌ సెలబ్రిటీలు.. ఇలా హడావుడి నడిచింది.

ఇంత హడావుడిలోనూ ఓ అందమైన అమ్మాయి చిద్విలాసంగా నవ్వులు చిందిస్తూ ఆ సెలబ్రిటీలతో ముచ్చట్లాడుతూ .. హైలైట్‌ అయ్యింది. మ్యాచ్‌లో బౌండరీలతో పాటు ఈ మగువ నవ్వులు కుర్రాళ్ల గుండెల్ని చిదిమేశాయి. పదే పదే కెమెరా ఆ అమ్మడినే చూపిస్తుంటే యువతరం అంతా పరేషాన్‌ అయిపోయారు. అంతేకాదు ఎవరీవిడ? ఇంత అందగత్తె.. అంటూ లక్షల్లో అభిమానులు ట్విట్టర్‌లో వెతుకులాడేశారు. అలా వెతికిన వారికి ఒక్కటే షాకింగ్‌ న్యూస్‌ తెలిసింది. ఈ భామపేరు రాఖీ కపూర్‌ టాండన్‌. 'ఎస్‌ బ్యాంక్‌' సీఈవో రానా కపూర్‌ కూతురు. రాస్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ డైరెక్టర్‌ అండ్‌ ప్రమోటర్‌ కూడా. పిన్సెల్వేనియాలో ఎంబీఏ పూర్తి చేసి నేరుగా కార్పొరెట్‌ కంపెనీ ఓనర్‌ అయ్యింది.

ఐపీఎల్‌లో వీలున్న ప్రతిచోటా తనదైన శైలిలో మెరుపులు మెరిపించింది. అయితే చివరిలో ఇంకో షాకింగ్‌ ఏమంటే ఈ అమ్మడు మ్యారీడ్‌. బిజినెస్‌ టైకూన్‌ అల్కేష్‌ టాండన్‌ని మనువాడేసింది. ఇది తెలిశాకే.. పాపం కుర్రాళ్లంతా బేజారెత్తిపోయారు. అయ్యో పాపం!