Begin typing your search above and press return to search.

తెలుగు జనాలపై మండిపోతున్న తాప్సి

By:  Tupaki Desk   |   24 May 2015 7:30 PM GMT
తెలుగు జనాలపై మండిపోతున్న తాప్సి
X
సూటిగా చెప్పట్లేదు కానీ.. టాలీవుడ్‌ జనాలు, మీడియాపై చాలా కోపమే ఉంది తాప్సికి. తనపై ఐరెన్‌ లెగ్‌ ముద్ర వేయడం.. ఫెయిల్యూర్స్‌ను తనకు అంటగట్టడం.. తాను బాగా నటించినపుడు గుర్తించకపోవడం.. తనలోని నటిని సంతృప్తి పరిచే పాత్రలివ్వకపోవడం మీద.. ఆమెలో చాలా అసంతృప్తే ఉంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ అసంతృప్తిని దాచుకోకుండా కక్కేసింది తాప్సి. ఇంతకీ ఈ సొట్టబుగ్గల సుందరి ఏమందో చూద్దాం పదండి.

''టాలీవుడ్‌లో నాపై అన్‌ లక్కీ అనే ముద్ర వేసేశారు. నేను చేసే సినిమాలేవీ హిట్టు కావని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆ ట్యాగ్‌ మారింది. హిందీలో బేబీ హిట్టయింది. తమిళంలో చేసిన సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. నన్ను అన్‌ లక్కీ అన్నపుడు ఎలా రియాక్టవ్వాలో తెలిసేది కాదు. ఒక్క సినిమాలో పది పదిహేను సీన్స్‌లో నేను కనిపిస్తా. ఆ మాత్రానికి సినిమా ఫెయిలైతే నేనెలా బాధ్యురాలిని అవుతాను. హిట్‌ అయితే హీరోకు క్రెడిట్‌ ఇస్తారు. ఫట్‌ అయితే మాత్రం హీరోయిన్‌కు ముడిపెడతారా? నా మాతృభాష హిందీ. కానీ నేను తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకున్నా. దీన్ని బట్టే నాకు తెలుగు సినిమాలంటే ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు. నేను గ్లామరస్‌ రోల్స్‌ చేయగలనుఉ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలూ చేయగలను. నన్ను గుర్తించి సరైన అవకాశాలివ్వమంటున్నా. నన్ను రాత్రికి రాత్రి స్టార్‌ను చేసింది తెలుగు మీడియానే. కానీ రివ్యూలు రాసేటపుడు హీరో, విలన్‌, కమెడియన్‌ గురించి కూడా డీటైల్డ్‌గా రాస్తారు. కానీ హీరోయిన్లకు మాత్రం అలా రాయరు. తాప్సి గుడ్‌.. అని మొక్కుబడిగా ఒక్క ముక్క రాస్తారు. మీడియా మీద నాకు కోపం కాదు బాధ'' అంటూ ఆవేదన వెళ్లగక్కింది తాప్సి. చూశారా.. ఇక్కడ సినిమాలు చేస్తున్నపుడు మాత్రం సైలెంటుగా ఉండి.. ఇప్పుడు మాత్రం ఓపెన్‌గా ఎలా వాయించేస్తోందో!