Begin typing your search above and press return to search.

మిల్కీ.. 10కి ఇక్కడుండట్లేదా??

By:  Tupaki Desk   |   2 July 2015 5:45 PM GMT
మిల్కీ.. 10కి ఇక్కడుండట్లేదా??
X
మిల్కీవైట్‌ బ్యూటీ తమన్నా నిన్నమొన్నటి వరకూ బాలీవుడ్‌లో ఇంటర్వ్యూలు, చిట్‌చాట్‌లతో హల్‌చల్‌ చేసింది. ముంబయ్‌ హైదరాబాద్‌ చెన్నయ్‌ కొచ్చి అన్నట్లు నాలుగు మూలలా ప్రిన్సెస్‌ అవంతిక పవరేంటో చూపించింది. బాహుబలికి ఉత్తరాదిన కావాల్సినంత ప్రచారం తెచ్చిపెట్టింది. అయితే తీరా టాలీవుడ్‌లో ప్రచారం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఏకంగా హ్యాండిచ్చేస్తోంది. మధ్యలోనే వదిలేసి క్రైసిస్‌ క్రియేట్‌ చేసేలా ఉంది.. తనని ఎంతగానో పొగిడేసిన రాజమౌళి కోసమైనా వేచి చూడలేని పరిస్థితి. కారణం ఏంటా? అని ఆరాతీస్తే మిల్కీ ముందున్న షెడ్యూల్‌ అలాంటిది.

ప్రస్తుతం మిల్కీ వేరొక సినిమా కోసం రెడీ అవుతోంది. నాగ్‌, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోని మల్టీస్టారర్‌లో అమ్మడు హీరోయిన్‌ అన్న విషయం తెలిసిందే. యూరప్‌ ఖండంలో షూటింగ్‌ షెడ్యూల్‌. ప్యారిస్‌, ఫ్రాన్స్‌, సెర్బియా వంటి అరుదైన లొకేషన్లలో భారీ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. ఇంతవరకూ తెలుగు సినిమాల్లో కనిపించని కొత్త లొకేషన్లని వేటాడి వెంటాడి వెతికి పట్టుకున్నారు. 30 రోజుల పాటు జరిగే షెడ్యూల్‌లో నాగ్‌, కార్తీ, తమన్నాలపై కీలకసన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. అక్కడికి ఈ వారంతంలోనే పయనమవుతోంది మిల్కీ.

అంటే జూలై 10న రిలీజయ్యే బాహుబలి రిలీజ్‌ డే నాటికి అమ్మడు అక్కడ మంచు కొండల్లో ప్రాచీన బిల్డింగ్స్‌ మధ్యన షూటింగ్‌ చేస్తుంటుందనమాట. అయ్యో.. అలాగైతే ఎలా మిల్కీ? ఇప్పటివరకూ అమ్మడు తెలుగు మీడియా ముందుకు రాలేదు. కాని తనకి ఉన్నది ఒకటి రెండు రోజుల టైమ్‌ మాత్రమే. ఆ తర్వాత యూరప్‌ విమానం ఎక్కేయాల్సిందే. మొత్తానికి బాహుబలి భారమంతా అనుష్కపైనే వేసేసి ఈమె జారుకుంటోందా??