Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌.. అనౌన్స్‌మెంట్‌ రాబోతోందా?

By:  Tupaki Desk   |   5 July 2015 3:30 PM GMT
ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌.. అనౌన్స్‌మెంట్‌ రాబోతోందా?
X
ఏంటో ఈ త్రివిక్రమ్‌ వ్యవహారం. సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమా తర్వాత మనోడి పేరు పుకార్లకు కేంద్రంగా మారిపోయింది. మహేష్‌, పవన్‌ కళ్యాణ్‌, ఎన్టీఆర్‌, నితిన్‌, నాగచైతన్య.. ఇలా త్రివిక్రమ్‌తో సినిమా చేసే హీరో అంటూ చాలా పేర్లు వినిపించాయి. నిన్న మొన్నటి దాకా నితిన్‌తో ఖాయమన్నారు. ఇప్పుడు లేదు.. లేదు.. ఎన్టీఆర్‌తో సినిమా అంటున్నారు. ఈ కాంబినేషన్లో సినిమాకు సంబంధించి ఈ నెల 11న అనౌన్స్‌మెంట్‌ కూడా రాబోతోందని సమాచారం. డేటు కూడా చెబుతున్నారంటే ఇందులో వాస్తవం ఉండే ఉంటుంది.

సన్నాఫ్‌ సత్యమూర్తి నిర్మాత రాధాకృష్ణ సోదరుడు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నట్లు కొన్ని రోజుల కిందట వార్త వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న త్రివిక్రమ్‌-ఎన్టీఆర్‌ సినిమా గురించి అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని అతనే మీడియాకు ఉప్పందించినట్లు తెలుస్తోంది. ఐతే కేవలం అనౌన్స్‌మెంట్‌ మాత్రమే ఇప్పుడుంటుందని.. సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి టైం పడుతుందని అంటున్నారు. ఐతే ఇది మొదలయ్యేలోపు త్రివిక్రమ్‌ నితిన్‌ లేదా నాగచైతన్యతో సినిమా తీయొచ్చని కూడా అంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌.. కొరటాల శివతో ఓ సినిమా చేస్తాడని కూడా ఈ మధ్య వీళ్లిద్దరికీ సన్నిహితులైన వాళ్లు చెప్పుకున్నారు. మరి నిజంగా ఏ సినిమా ఖాయమన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.