Begin typing your search above and press return to search.

అన్ని సినిమాలు తెలుగోళ్లపై రుద్దను-సూర్య

By:  Tupaki Desk   |   24 May 2015 7:30 PM GMT
అన్ని సినిమాలు తెలుగోళ్లపై రుద్దను-సూర్య
X
రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌ల తర్వాత తెలుగులో అంత మార్కెట్‌ సంపాదించుకున్న తమిళ స్టార్‌ హీరో సూర్య. 'గజిని'తో ఇక్కడి ప్రేక్షకుల మనసు గెలిచిన సూర్య.. ఆ సినిమా తెచ్చిన మార్కెట్‌ను అంతకంతకూ పెంచుకుంటూ సాగుతున్నాడు. తన ప్రతి సినిమానూ తెలుగులోకి అనువదిస్తూ.. చక్కగా ప్రమోట్‌ చేస్తూ మంచి వసూళ్లు రాబడుతున్నాడు సూర్య. అతడి కొత్త సినిమా 'రాక్షసుడు' ప్రమోషన్‌లో భాగంగా.. తెలుగులో తన మార్కెట్‌ పరిధి గురించి.. దీని వల్ల కలుగుతున్న వెసులుబాటు గురించి మాట్లాడాడు సూర్య.

''తెలుగులో మార్కెట్‌ పెరగడం వల్ల బడ్జెట్‌ విషయంలో చాలా వెసులుబాటు కలుగుతోంది. ఓ దర్శకుడు ఒక పెద్ద ఐడియాతో వచ్చినా నాకు, మా తమ్ముడు కార్తీకి తెలుగులోనూ మార్కెట్‌ ఉండటం వల్ల నిర్మాతలు ధైర్యంగా డబ్బులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న వాళ్లకు మరిన్ని మంచి సినిమాలు అందించాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఐతే మేం చేసే ప్రతి సినిమానూ తెలుగులోకి తేలేం. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఉంటేనే డబ్‌ చేస్తాం. కార్తి గత ఏడాది మద్రాస్‌ అనే సినిమా చేశాడు. అది పూర్తిగా మద్రాస్‌ నేపథ్యంలో సాగే సినిమా. నేటివిటీ ఉంటుంది. అలాంటి సినిమాలు ఇక్కడి ప్రేక్షకులకు సూటవ్వదు. అందుకే తెలుగులోకి తేలేదు. మార్కెట్‌ ఉంది కదా అని ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకులపై రుద్దాలనుకోవడం లేదు'' అని చెప్పాడు సూర్య.