Begin typing your search above and press return to search.

రేవంత్ కేసులో తెలంగాణ ఏసీబీకి సుప్రీం షాక్

By:  Tupaki Desk   |   3 July 2015 9:48 AM GMT
రేవంత్ కేసులో తెలంగాణ ఏసీబీకి సుప్రీం షాక్
X
తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిలు ఇస్తూ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. తెలంగాణ ఏసీబీ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, హరీన్ రావెల్ లు వాదించారు. రేవంత్ అరెస్టయిన ఒక్క రోజులో బెయిలు వస్తే పరిశీలించాలి కానీ రేవంత్ 30 రోజులు జైలులో ఉన్నారనీ, పైగా రేవంత్ వాంగ్మూలాన్ని సెక్షన్ 164 కింద రికార్డు చేశారనీ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

రేవంత్ బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి కోర్టు పరిశీలనకు చేపట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ఓటును కొలుగోలు చేసేందుకు ప్రయత్నించా రన్న ఆరోపణకు సంబంధించిన ఆడియో, వీడియో టేప్‌లపై ఫోరెన్సిక్‌ లాబొ రేటరీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందంటూ ఈ కేసులో ప్రథమ నిందితునికి బెయిల్‌ మంజూరు చేయడం వల్ల సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదముందని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. అయితే.... సుప్రీంకోర్టు మాత్రం రేవంత్ కు అనుకూలంగా తీర్పిచ్చింది. నెల రోజులు తరువాత బెయిలు ఇవ్వడంపై అభ్యంతరం ఏముంటుందని పేర్కొంది. దీంతో రేవంత్ కు వ్యతిరేకంగా తెలంగాణ ఏసీబీ చేస్తున్న ప్రయత్నాలకు గండి పడినట్లయింది.