Begin typing your search above and press return to search.

ఈ వారానికి మహేష్‌బాబే హీరో

By:  Tupaki Desk   |   29 Jun 2015 3:30 PM GMT
ఈ వారానికి మహేష్‌బాబే హీరో
X
బాహుబలి సూపర్‌ హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన సినిమా 'శ్రీమంతుడు'ను ఆగస్టుకు వాయిదా వేసుకున్నాడు మహేష్‌ బాబు. కానీ బాహుబలి రావడానికి ఓ వారం ముందు మహేష్‌ సినిమా ఇంకోటి రిలీజవబోతోంది. శ్రీమంతుడు కాకుండా మహేష్‌ ఇంకే సినిమా చేసినట్లు లేదే అనుకోకండి. ఆ సినిమాలో మహేష్‌ నటించలేదు కానీ.. కథ అంతా మహేష్‌ బాబు చుట్టూనే తిరుగుతుంది. ఆ సినిమానే.. సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌. చాన్నాళ్ల కిందటే ట్రైలర్‌తో ఆసక్తి రేపిన ఈ సినిమా జులై 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సుశాంత్‌ రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాలో నందు, భూపాల్‌, ఆదర్శ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. డబ్బు కోసం నానా తంటాలు పడుతున్న ముగ్గురు కుర్రాళ్లు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబును కిడ్నాప్‌ చేయాలనుకుంటారు. వారి ప్రయత్నం ఫలించిందా లేదా అన్న కథాంశంతో తెరకెక్కుతోందీ సినిమా. మరి మహేష్‌ను చూపించకుండా అతడి చుట్టూ సినిమాను ఎలా నడిపిస్తారన్నది ఆసక్తికరమే. నాని, అల్లరి నరేష్‌, మంచు మనోజ్‌ లాంటి హీరోలు ఇందులో అతిథి పాత్రలు పోషించారు. ఇప్పుడు నడుస్తున్న క్రైమ్‌ కామెడీ జానర్లోనే తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుందని డైరెక్టర్‌ సుశాంత్‌ చెబుతున్నాడు. ఈ వారం బస్తీ, యూత్‌ఫుల్‌ లవ్‌, శీనుగాడి లవ్‌స్టోరీ, ది బెల్స్‌ లాంటి సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ 'సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌' వాటన్నింట్లోకి కొంచెం క్రేజ్‌తో విడుదల కాబోతోంది.