Begin typing your search above and press return to search.

పక్కాగా కిడ్నాప్‌ చేసేస్తున్నారట!!!

By:  Tupaki Desk   |   2 July 2015 5:45 PM GMT
పక్కాగా కిడ్నాప్‌ చేసేస్తున్నారట!!!
X
అసలు తమ టార్గెట్‌ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ అని ఎట్టకేలకు ఒప్పుకున్నారు సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌ సినిమా బాబులు. ఈ సినిమాను సుశాంత్‌ రెడ్డి అనే యువదర్శకుడు తీశాడు. మధ్యలో మనోడు ఏదో డ్రగ్స్‌ కేస్‌ అంటూ లీగల్‌ చిక్కుల్లో ఇరుక్కోవడంతో కాస్త ఇబ్బందే అయిపోయింది. అప్పట్లో ఇదే కేసులో హీరో నందు కూడా ఉన్నాడని వార్తలు రావడంతో మనోడు టివిలకు ఎక్కి మరీ క్లారిటీ ఇచ్చేసుకున్నాడు. ఇంతకీ ఆ సుశాంత్‌ రెడ్డి తీసిన ఈ ''సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌''లో నందు మెయిన్‌ హీరో. కట్‌ చేస్తే.. ఇంతకీ ఈ కిడ్నాప్‌ ఎలా ఉండబోతోంది.

ఖచ్చితంగా సినిమా సూపర్‌ హిట్‌ అంటున్నారు ఈ సినిమా ప్రొడ్యూసర్స్‌ అండ్‌ డైరక్టర్స్‌. ఎందుకు నాయనా అంటే సినిమాలో మహేష్‌ ఫ్యాన్స్‌ను ఈ కిడ్నాప్‌ విపరీతంగా ఆకట్టుకుంటుందట. వారి కోసమే ఈ సినిమా స్పెషల్‌ అన్నట్లు చెప్పేశారు. అంటే ఈ సినిమా ఆడాలంటే అందుకు మహేష్‌ ఫ్యాన్స్‌ సహకారం ఉండాల్సిందే. అప్పట్లో ఎలాగైతే అష్టాచమ్మా సినిమాలో మహేష్‌ మహేష్‌ష్‌ అంటూ స్వాతి ఓరగా పిలువగానే మహేష్‌ఫ్యాన్స్‌ ఫ్లాటైపోయారో ఇప్పుడు కూడా సేమ్‌ అలాగే మన ప్రిన్స్‌ ఫ్యాన్స్‌ అందరూ ఫ్లాటైపోతే ఓకె.. ఒకవేళ అలా కాకుండా ఏమైనా తేడా జరిగి ఫ్యాన్స్‌ హర్టయితే మాత్రం సినిమా సీన్‌ సితారే. ఏదైనా కూడా మహేష్‌ ఫ్యాన్స్‌ చేతిలోనే ఉంది. పక్కాగా కిడ్నాప్‌ చేస్తున్నాం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్‌ చేస్తారని ఆశిద్దాం.