Begin typing your search above and press return to search.

సుకుమార్‌ను మెస్మరైజ్‌ చేసిన సినిమా

By:  Tupaki Desk   |   3 July 2015 7:36 AM GMT
సుకుమార్‌ను మెస్మరైజ్‌ చేసిన సినిమా
X
తన సినిమాలకు వచ్చిన ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేయడానికి ట్రై చేస్తుంటాడు సుకుమార్‌. '1 నేనొక్కడినే' సినిమాను మొదట్లో ఫ్లాప్‌ అన్నవాళ్లు సైతం ఇప్పుడు మళ్లీ డీవీడీ పెట్టుకుని చూస్తూ మెస్మరైజ్‌ అయిపోతున్నారు. ఏం తీశాడ్రా సుకుమార్‌ అనుకుంటున్నారు. ఐతే ఈ మధ్య సుక్కు చూసిన ఓ సినిమా కూడా ఆయన్ని అలాగే మెస్మరైజ్‌ చేసిందట. ఆ సినిమా పేరు.. కంట్రోల్‌ సి. ఇదేమీ హాలీవుడ్‌ సినిమా కాదు. మన తెలుగు సినిమానే. సుకుమార్‌ అన్న కొడుకు అశోక్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా ఇది. ఇటీవలే సుకుమార్‌ 'కంట్రోల్‌ సి' ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''అమెరికాలో ట్విన్‌ టవర్స్‌ కూలిపోయినపుడు ప్రాణాలతో బయటపడిన ఓ జంటకు ఓ సీడీ దొరుకుతుంది. ఆ సీడీ వారి జీవితాలను ఎలా మార్చిందన్న కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ జానర్‌ సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదు. నైట్‌ ఎఫెక్ట్‌ విజువల్స్‌ చూసి మెస్మరైజ్‌ అయిపోయాను. సినిమా ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌లో ఉంది. మా అశోక్‌ నా బాటలోనే డైరెక్టర్‌ అవుతాడనుకున్నా. కానీ హీరో అయ్యాడు'' అని చెప్పాడు సుకుమార్‌. సాయిరామ్‌ చల్లా అనే కొత్త దర్శకుడు 'కంట్రోల్‌ సి' రూపొందించాడు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.