Begin typing your search above and press return to search.

పోకిరి... మహేష్ కాదు సుధీరే

By:  Tupaki Desk   |   1 July 2015 1:30 PM GMT
పోకిరి... మహేష్ కాదు సుధీరే
X
అలనాటి అందాల నటుడు శోభన్ బాబు అన్నది ఎంత నిజమో ఈ నాటి అందాల నటుడు మహేష్ బాబు అనేది కూడా అంతే నిజం. దర్శకుడు పూరి వల్ల పోకిరి అని అనిపించుకున్నాడే తప్ప తెర బయట మహేష్ జెంటిల్ మానే. కానీ బావమరిది సుదీర్ మాత్రం తెర మీద మంచి వాడిగా నటిస్తూ తెరవెనుక పోకిరి చేష్టలు చేస్తున్నాడు. ఆ చేష్టలేమిటో మీరే చదవండి.

గతనెల 19న సుధీర్ నటించిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమా విడుదలయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ మంచిదే అయినా దర్శకుడు దీన్ని తీర్చిదిద్దిన విధానం మాత్రం అస్సలు బాగోలేదు. పాటలు అర్థవంతంగా, వినసొంపుగా వుండటంతో సోసో గా ఆడింది. ఈ మాత్రం దానికి సక్సెస్ మీట్ పేరుతో ప్రమోషన్ చేయలనుకోవడం మంచిదే. అయితే ఇక్కడే సుదీర్ కాస్త హద్దు దాటాడు. మహేష్ కి పోకిరి ఎలాంటి సినిమానే నాకు ఈ సినిమా అలాంటింది అని చెప్పుకొచ్చాడు. అసలు ఆ సినిమాకి అప్పటికి మహేష్ ఇమేజ్ కి.. ఈ సినిమాకి సుదీర్ ఇమేజ్ కి ఏమాత్రమైనా సంబంధం వుందా..? ఇప్పుడు చెప్పండి అసలు పోకిరి ఎవరో..