Begin typing your search above and press return to search.

పిక్కల పైకి నిక్కరేసి ఈ శృతులేంటో...

By:  Tupaki Desk   |   6 July 2015 7:30 PM GMT
పిక్కల పైకి నిక్కరేసి ఈ శృతులేంటో...
X
మూడు భాషల్లో అరడజను సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది శ్రుతిహాసన్‌. శ్రీమంతుడు, పులి, యారా, వెల్‌కమ్‌ బ్యాక్‌, రాకీ హ్యాండ్సమ్‌, అజిత్‌ సినిమా.. ఇన్ని ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. ముంబై టు హైదరాబాద్‌, హైదరాబాద్‌ టు చెన్నయ్‌, ముంబై నుంచి ఇతర నగరాలు.. నిత్యం తిరగాల్సిందే. అయినాసరే తండ్రిలానే ఓపిగ్గా పనిచేస్తూ ఒక్కో మెట్టు పైకెక్కుతోంది.

ఇటీవలే బాలీవుడ్‌లో గబ్బర్‌ (ఈజ్‌ బ్యాక్‌) చిత్రంతో సూపర్‌ హిట్‌ కొట్టింది. బాలీవుడ్‌లో దిమ్మతిరిగే సక్సెస్‌ని ఇచ్చింది ఈ సినిమా. అయితే ఆ విజయాన్ని ఆస్వాధిస్తూ కిక్కులో ఉండగానే మరో హిట్టు కొట్టేట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అనీస్‌ బజ్మి దర్శకత్వంలో 'వెల్‌కమ్‌ బ్యాక్‌'లో నటిస్తోంది. వెల్‌కమ్‌ చిత్రానికి సీక్వెల్‌ ఇది. జాన్‌ అబ్రహాం, అనీల్‌ కపూర్‌, పరేష్‌ రావల్‌, నానా పటేకర్‌ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిగో ఇక్కడున్న ఫోటోలో శ్రుతిహాసన్‌ ఠీవి చూస్తుంటే కచ్ఛితంగా మరో హిట్‌ కొడుతున్నా అన్న ధీమా కనిపిస్తోంది. రెడ్‌ జాకెట్‌, బ్లాక్‌ కాంబినేషన్‌ బాటమ్‌ లైన్‌తో అదరగొట్టేసింది. పిక్కలపైకి నిక్కరు తొడిగి కుర్రకారును స్పెల్‌బౌండ్‌ చేసేసింది. ఈ మాఫియా సామ్రాజ్యానికి నేనే డాన్‌ని. ఈ ప్రపంచాన్ని ఏలేది నేనే.. అన్నట్టు కాన్ఫిడెంటుగా కనిపిస్తోంది. ఆ కాన్ఫిడెన్స్‌ చూస్తుంటే హిట్టు షురూ అనిపిస్తోంది.