Begin typing your search above and press return to search.

టోటల్‌ ముంబయ్‌ 'శృతి'లోనే ఉంది..

By:  Tupaki Desk   |   3 July 2015 9:30 AM GMT
టోటల్‌ ముంబయ్‌ శృతిలోనే ఉంది..
X
లక్‌ సినిమాతో లక్కు చిక్కక పరేషాన్‌ అయిపోయింది శ్రుతిహాసన్‌. బాలీవుడ్‌లో తొలి సినిమాతోనే ఐరెన్‌లెగ్‌ అన్న ముద్ర వేయించుకుంది. ముంబై పరిశ్రమలో మొహం చెల్లని పరిస్థితిలో ఇరుక్కుంది. అయితే ఆ క్రమంలోనే దక్షిణాదిన తన లక్కు చెక్‌ చేసుకునేందుకు ఇటొచ్చింది. తలచిందే తలంపుగా ఇక్కడ కూడా మనవాళ్లు రెడ్‌ కార్పెట్‌ వేయలేదు.

ఇక ముంబైలో సీనే హైదరాబాద్‌, చెన్నయ్‌ పరిశ్రమల్లోనూ రిపీటైంది. టాలీవుడ్‌లో ఆరంగేట్రమే అనగనగన ఒక ధీరుడు లాంటి అట్టర్‌ఫ్లాప్‌లో నటించింది. అందం ఉంది. చందం ఉంది.. అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో.. అన్న చందంగా అయిపోయింది పరిస్థితి. కట్‌ చేస్తే వన్‌ ఫైన్‌ డే పవర్‌స్టార్‌ సరసన గబ్బర్‌సింగ్‌లో నటించింది. దిమ్మదిరిగిపోయే హిట్టొచ్చింది. ఫలితం ఓవర్‌నైట్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఇక అక్కణ్ణుంచి తిరిగి చూసుకున్నదే లేదు. సౌత్‌లో స్టార్‌ హీరోలందరి సరసన నటించేసింది ఇప్పటికే. అంతేనా ఎక్కడికి వెళితే అక్కడ స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంటూ హస్కీ వాయిస్‌తో మస్కా వేస్తోంది.

నడక, నడత, ఫ్యాషన్‌, ట్రెండ్స్‌ అన్నిటినీ మార్చేసింది ఇప్పుడు. ఏ పరిశ్రమకి వెళ్లినా అక్కడ సలామ్‌ కొట్టేలా స్టార్‌డమ్‌ సంపాదించేస్తోంది. అయితే దీనికోసం కొంత పట్టువిడుపు అన్న పద్ధతిని ఆచరిస్తోంది. ఇది చెయ్యను, అది చెయ్యను అని చెప్పదు. భాష విషయంలో సమస్య లేకుండా పట్టుదలగా నేర్చేసుకుని స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంటోందిప్పుడు. హిందీలో హిందీ నాయికలకే పాఠాలు నేర్పించే రేంజుకి ఎదిగిపోయింది. నవతరం నాయికలదరికీ తీవ్రమైన పోటీ ఇస్తోంది.

ఐరెన్‌ లెగ్‌ అన్నచోటే గోల్డెన్‌ లెగ్‌ అనిపించుకుంటోంది శృతి. ఇతర నటీనటులకు కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది. తండ్రిలోని పట్టుదలను పుణికి పుచ్చుకున్న శ్రుతి ప్రస్తుతం ముంబైని వైరస్‌లా ఒణికిస్తోంది.