Begin typing your search above and press return to search.

పని పనే.. సెక్సీ లుక్సు లుక్సే

By:  Tupaki Desk   |   24 May 2015 3:30 PM GMT
పని పనే.. సెక్సీ లుక్సు లుక్సే
X
కాస్త కన్ఫ్యూజన్‌గా ఉంది కదూ. అబ్బే ఏం లేదు. కొంతమంది హీరోయిన్లు ఇక తమ పని అయిపోయింది అని తెలియగానే వెంటానే దుకాణం సర్దేయడానికి రెడీగా ఉంటారు. ముఖ్యంగా జిమ్ములకు డబ్బులు ఖర్చుపెట్టడం, సోకులకు పైసల్‌ తగలేయడం, ఫిటనెస్‌ మీద ఫోకస్‌ పెట్టడం మానేస్తారు. అసలే ఛాన్సులు లేవనుకుంటే, వీళ్లు ఇలా లావెక్కి కాస్త అందగ్రస్తంగా తయారవ్వడంతో అవకాశం ఇద్దామనకునన్న ఔత్సాహికులు కూడా మిడిల్‌ డ్రాపే. కాని సెక్సీ బ్యూటి శ్రీయ అలా కాదండోయ్‌.

ఓ 12 ఏళ్ళ క్రితం వరుస సినిమాలో హాట్‌ సొగసులతో టాలీవుడ్‌ను ఊపేసిన శ్రీయ.. నిధానంగా అవకాశాలు కోల్పోతూ వచ్చింది. ఇప్పుడేమో ఏకంగా ఆంటీ పాత్రలు కూడా చేస్తోంది. అయినాసరే ఫిట్‌నెస్‌ విషయంలో శ్రీయ ఏమాత్రం తగ్గదు. ఇప్పుడున్న స్టార్‌ హీరోయిన్స్‌లాగానే సెక్సీ ఫిజిక్‌ ఈమె సొంతం. ఫేస్‌లో మెట్యరిటీ కనిపిస్తుంది కాని స్ట్రక్చర్‌తో మాత్రం పిచ్చి కిక్కిచేస్తోంది. కారణం ఏంటంటారా... రోజూ పవర్‌ యోగా, లేకపోతే జిమ్‌ చేస్తుంది. వీలున్నప్పుడు ఫామ్‌ హౌస్‌కు వెళ్ళి కొన్ని పొలం పనుల్లో కూడా వేలెడుతుంది. అప్పుడప్పుడూ ముంబయ్‌లోని బాంద్రాలో వీధుల్లో సైకిల్‌ కూడా తొక్కుతుంటుంది. ఇన్ని విధాలుగా బాడీని కరగదీస్తుంటే ఇక కొవ్వెక్కే ఛాన్సేలేదు. పని లేకపోయినా కూడా, హాట్‌ లుక్‌ మెయిన్‌టైన్‌ చేయడం ఈమెకు ఇష్టమట.